• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'శుభం' టీమ్ తో తిరుమలకు...

'శుభం' టీమ్ తో తిరుమలకు సామ్.. ఆ డైరెక్టర్ కూడా వెళ్లారేంటి?

| తాజాగా వీరిద్దరూ కలిసి తిరుమలలో కనబడడం డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఏదేమైనా సమంత, రాజ్‌ నిడిమోరు క్లారిటీ ఇస్తే కానీ ఆ వార్తలకు చెక్ పడదు.

By - Tupaki Desk
Update: 2025-04-19 17:36 GMT

స్టార్ హీరోయిన్ సమంత.. ఓవైపు నటిగా.. మరో వైపు నిర్మాతగా బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్.. ఓ రేంజ్ లో అదరగొట్టారని చెప్పాలి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో తన టాలెంట్ ఏంటో చూపించారు. సిరీస్ విషయంలో కష్టానికి ప్రతిఫలం అందుకున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు సమంత. సిరీస్ లో మహారాణి రోల్ లో ఆమె కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సిరీస్ స్ట్రీమింగ్ కూడా కానుంది. అదే సమయంలో మా ఇంటి బంగారం మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు సమంత. నటిస్తూనే.. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు.

దాంతోపాటు ఇప్పుడు తన బ్యానర్ పై రూపొందించిన శుభం రిలీజ్ కు సిద్ధమవుతోంది. మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ నేపథ్యంలో తాజాగా శుభం మూవీ టీమ్ తో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లారు సామ్. శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించి వెంకన్నను ప్రార్థించారు!

అయితే తిరుమలలో సమంతతోపాటు డైరెక్టర్ రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకున్నారని జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

దీనిపై ఇప్పటి వరకు సామ్ గానీ రాజ్ గానీ రెస్పాండ్ అవ్వలేదు. ఆ మధ్య వరుస ఈవెంట్స్ లో ఇద్దరూ కలిసి కనిపించారు. పికిల్ బాల్‌ టోర్నమెంట్‌ లో ఒకరి చేయి ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ సమయంలో ఎక్కువగా సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత వివిధ బర్త్ డే పార్టీల్లో ఇద్దరూ కలిసి మెరిశారు.

తాజాగా వీరిద్దరూ కలిసి తిరుమలలో కనబడడం డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఏదేమైనా సమంత, రాజ్‌ నిడిమోరు క్లారిటీ ఇస్తే కానీ ఆ వార్తలకు చెక్ పడదు. అయితే రాజ్ నిడిమోరు తెలుగు వారేనన్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతికి చెందిన ఆయనకు ఇప్పటికే పెళ్లి అయింది. మరి సామ్, రాజ్ డేటింగ్ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Tags:    
  • SamanthaRuthPrabhu 
  • RajNidimoru 
  • Tirumala 
  • TollywoodBuzz 
  • TempleVisit 
  • Shubham 
  • TheFamilyMan2 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS