• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సామ్ 'బంగారం'.. ఏదో...

సామ్ 'బంగారం'.. ఏదో అనుకుంటే ఇంకేదో..

| ఇదిలా ఉంటే.. సినిమా వాయిదా పడుతుందనే వార్తలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. మొదట మే రిలీజ్ అనుకున్నా, తర్వాత జూన్ 4 తేదీకి షిఫ్ట్ అవుతుందనే టాక్ వచ్చింది.

By - M Prashanth
Update: 2026-05-03 11:11 GMT

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ బేబీ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత నందిని రెడ్డి, సమంత కాంబినేషన్‌ లో వస్తున్న ఆ సినిమాపై ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు కూడా ఆకట్టుకోవడంతో సినిమా సమ్మర్ సీజన్‌ లో మంచి హిట్ అవుతుందని మూవీ లవర్స్ భావించారు.

అయితే సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పరిస్థితి మొత్తం మారిపోయినట్లుగా కనిపిస్తోంది. మొదట మే 15వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేసిన ఆ చిత్రానికి ఇప్పటివరకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సమంత సినిమా అంటే ముందుగానే భారీ హైప్, ప్రమోషనల్ ఈవెంట్స్ ఉండటం సహజం. కానీ ఈసారి మాత్రం సామ్ పూర్తిగా సైలెంట్‌ గా ఉండడం అభిమానుల్లో సందేహాలను రేకెత్తిస్తోంది.

ఇదిలా ఉంటే.. సినిమా వాయిదా పడుతుందనే వార్తలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. మొదట మే రిలీజ్ అనుకున్నా, తర్వాత జూన్ 4 తేదీకి షిఫ్ట్ అవుతుందనే టాక్ వచ్చింది. కానీ అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఆ తేదీని లాక్ చేసుకోవడం వల్ల పరిస్థితి మారింది. ముఖ్యంగా పెద్ది సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధమవుతుండగా, మరో చిత్రం లెనిన్ జూన్ 26న రానుంది.

దీంతో మా ఇంటి బంగారం సినిమాకు సరైన రిలీజ్ స్లాట్ దొరకడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ముందు రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకటి ముందుగా అనుకున్నట్లే మే 15న విడుదల చేయడం, లేకపోతే జూన్ మధ్యలో లేదా జూలైకి వాయిదా వేయడం. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే జూలై రిలీజ్ వైపు టీమ్ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ ఏడాది సమ్మర్ సీజన్‌ లో ఇప్పటివరకు పెద్ద హిట్ నమోదు కాలేదు. అందువల్ల సమంత సినిమా ఆ లోటు తీరుస్తుందని అంతా ఆశించారు. కానీ రిలీజ్ డేట్ విషయంలో ఏర్పడిన కన్ఫ్యూజన్ కారణంగా ఆ అంచనాలు ఇప్పుడు నెరవేరే అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తోంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్లు అర్థమవుతుంది. మరోవైపు.. సమంత వ్యక్తిగతంగా కూడా మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్‌ లో ఎక్కువగా కనిపించకపోవడం గమనార్హం.

బర్త్ డే సందర్భంగా కొన్ని కార్యక్రమాలు, సుమతో చేసిన ఇంటర్వ్యూ తప్ప పెద్దగా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయలేదు. ఇది కూడా సినిమా వాయిదా వార్తలకు బలం చేకూర్చుతోంది. మొత్తానికి భారీ అంచనాలతో రూపొందుతున్న మా ఇంటి బంగారం మూవీ ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో చిక్కుల్లో పడినట్లయింది. అభిమానులు మాత్రం సమంత సినిమా ఎప్పుడొస్తుందో, ఎలాంటి ఫలితం సాధిస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మేకర్స్ తీసుకునే తుది నిర్ణయం ఏంటన్నది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    
  • samantha 
  • maaintibangaram 
  • tollywood 
  • movierelease 
  • telugucinema 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS