స‌రికొత్త ప్ర‌యాణంలో స‌మంత‌!

టాలీవుడ్ - కోలీవుడ్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Update: 2026-08-15 12:49 GMT

టాలీవుడ్ - కోలీవుడ్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే నటిగా, స్టైలిష్ ఐకాన్‌గా అలరించిన సమంత హోస్ట్‌గా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పాపులర్ రియాలిటీ షో సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ కి అమ్మ‌డు హోస్ట్‌గా వ్యవహరించనున్నారని అధికారిక సమాచారం వెలువడటంతో అభిమానులలో సందడి మొదలైంది. ఈ రియాలిటీ షోలో సమంత హోస్ట్‌గా వ్యవహరించడం కెరీర్‌లో ముఖ్యమైన మలుపుగా చెప్పొచ్చు.

సాధారణంగా మాస్టర్‌చెఫ్ వంటి పాపులర్ షోలకు స్టార్ హీరోలు .. అగ్ర దర్శకులు హోస్ట్‌లుగా ఉండటం చూస్తుంటాం. అయితే సమంత వంటి క్రేజీ హీరోయిన్ ఆ బాధ్యతను స్వీకరించడం షోకి అదనపు ఆకర్షణగా నిలవనుంది. స‌మంత‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ -వాక్చాతుర్యం షోని మరో స్థాయికి తీసుకువెళ్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. సమంత కెరీర్ ఆరంభం నుండి తనను తాను నిరూపించుకోవడానికి ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, ఇప్పుడు ఇలాంటి రియాలిటీ షోల ద్వారా ప్రతిభను చాటుకుంటున్నారు.

సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ వంటి షోలలో పాల్గొనే సెలబ్రిటీల మధ్య ఉండే పోటీని వారి వంట నైపుణ్యాలను ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరిస్తూనే సమంత తనదైన శైలిలో షోను రక్తి కట్టిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇప్పటికే షోకు సంబంధించిన షూటింగ్ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. తమిళ ప్రేక్షకులతో సమంతకు ఉన్న అనుబంధం చాలా బలమైనది. తన నటనతో కోలీవుడ్ అభిమానులను ఫిదా చేసిన సామ్ ఇప్పుడు హోస్ట్‌గా వారిని ఎంతవరకు మెప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రోమోలు, అప్‌డేట్స్ చూస్తుంటే సమంత సరికొత్త అవతారంలో అదరగొట్టడం ఖాయమని తెలుస్తోంది.

ఈ షో కేవలం వంటకు సంబంధించింది మాత్రమే కాదు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు, వారి జీవితంలోని తెలియని కోణాలు కూడా ప్రేక్షకులకు పరిచయం అవుతాయి. ఒక హోస్ట్‌గా సమంత, సెలబ్రిటీల నుండి ఆసక్తికరమైన విషయాలను రాబట్టడంలో ఎంతో చొరవ చూపుతారని అభిమానులు ఆశీస్తున్నారు. తమిళ బుల్లితెరపై సమంత రాకతో షో టీఆర్పీ రేటింగ్‌లు భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మొత్తంగా నటిగా తనదైన ముద్ర వేసిన సమంత సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ ద్వారా టెలివిజన్ రంగంలో కూడా సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమయ్యారు. సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా? తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు అమ్మ‌డు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఈ షో కోసం సామ్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News