చీరకట్టులో సమంత హొయలు!

మొదటి సినిమాతోనే అబ్బాయిల కలలు రాకుమారిగా మారిపోయింది.. ఈ సినిమా తర్వాత పలు చిత్రాలలో అవకాశాలు అందుకున్న ఈమె.. ఎన్టీఆర్ తో బృందావనం సినిమా చేసి అలరించింది;

Update: 2025-10-28 21:30 GMT

ఏ మాయ చేసావే అనే సినిమాతో నాగచైతన్య హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. మొదటి సినిమాతోనే అబ్బాయిల కలలు రాకుమారిగా మారిపోయింది.. ఈ సినిమా తర్వాత పలు చిత్రాలలో అవకాశాలు అందుకున్న ఈమె.. ఎన్టీఆర్ తో బృందావనం సినిమా చేసి అలరించింది. ఆ తర్వాత మహేష్ బాబు దూకుడు సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సమంత.. ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య, ఆటోనగర్ సూర్య, మనం, రభస, అ ఆ, మహానటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.




కెరియర్ పీక్స్ లో ఉండగానే.. తన మొదటి సినిమా హీరో నాగచైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా పేరు దక్కించుకున్న సమంత.. పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.. ఆ తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడి చికిత్స తీసుకోవడానికి విదేశాలకు వెళ్లిన ఈమె.. అక్కడే ఏడాది పాటు ఉండిపోయింది. అంతేకాదు ఇండస్ట్రీకి సంవత్సరం విరామం ప్రకటించిన ఈమె.. మళ్లీ ఇప్పుడు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ను స్థాపించి శుభం అనే సినిమా నిర్మించింది. ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో తన సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా నిన్న ఘనంగా పూర్తయ్యాయి.




ఇదిలా ఉండగా ఒకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేసే ఈమె..మరొకవైపు తాను ఎక్కడికి వెళ్లినా అందుకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రాబ్ రిపోర్ట్ ఇండియా లగ్జరీ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం కొన్ని ఫోటోలను పంచుకుంది. బ్లూ కలర్ చీర కట్టులో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్లూ కలర్ ట్రాన్స్పరెంట్ చీర ధరించిన ఈమె అందులో తన అందాలను వలకబోస్తూ ఫోటోలను షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లూ కలర్ బ్లౌజ్ ధరించిన ఈమె...అందుకు తగ్గట్టుగా బ్లూ కలర్ పూసలతో అందంగా డిజైన్ చేసిన చౌకర్ ను ధరించింది. తన జుట్టును అద్భుతంగా ముడివేసి తన మేకోవర్ను స్టయిల్ చేసుకుంది. ప్రస్తుతం సమంత ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




ఈ రాబ్ రిపోర్ట్ మ్యాగజైన్ విషయానికి వస్తే..RPSG లైఫ్ స్టైల్ మీడియా ద్వారా ప్రచురించబడే ఒక లగ్జరీ మ్యాగజైన్ గా రాబ్ రిపోర్టు పేరు సొంతం చేసుకుంది. గతంలో ఇండియా టుడే గ్రూప్ దీనిని ప్రచురించగా ఇప్పుడు శ్రద్ధ షహాని మేనేజింగ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాగజైన్ కేవలం లగ్జరీ ఉత్పత్తులపైనే కాకుండా క్యూరేటెడ్ అనుభవాలపై కూడా దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా లగ్జరీ కార్లు, ఫ్యాషన్, ప్రయాణం, ఆభరణాలు, గడియారాలు, కళ ఇలా ఇతర ఉత్పత్తులు, అనుభవాలకు ప్రత్యేక నిలయం అని చెప్పవచ్చు

Tags:    

Similar News