• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షాకింగ్‌: 'మంత్ర‌గ‌త్తె...

షాకింగ్‌: 'మంత్ర‌గ‌త్తె కంగ‌న‌'కు స‌మంత మ‌ద్ధ‌తు

| తాజాగా కంగనా మంత్రగత్తె(విచ్‌)ల గురించి సుదీర్ఘ వ్యాసం రాసింది. అయితే ఈ పోస్ట్ కి టాలీవుడ్ క్వీన్ సమంతా రూత్ ప్ర‌భు త‌న‌ మద్దతును ఇచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-10-21 04:08 GMT

జాతీయ ఉత్త‌మ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తన సాహసోపేతమైన, చమత్కారమైన సంభాష‌ణ‌ల‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. వివాదాలు ఉన్నా మాట తీరుతో మంత్ర‌ముగ్ధం చేయ‌డం కంగ‌నకు అల‌వాటు. తాజాగా కంగనా మంత్రగత్తె(విచ్‌)ల గురించి సుదీర్ఘ వ్యాసం రాసింది. అయితే ఈ పోస్ట్ కి టాలీవుడ్ క్వీన్ సమంతా రూత్ ప్ర‌భు త‌న‌ మద్దతును ఇచ్చింది.

``మంత్రగత్తెలకు భయపడవద్దు.. వారిని కాల్చిన వారికి భయపడండి`` అని ఒక వైరల్ X పోస్ట్‌కు ప్రత్యుత్తరం ఇస్తూ కంగనా ఇలా రాసింది. ``మంత్రగత్తెలు తమ ఉన్నత స్వభావానికి, అంతర్ దృష్టికి ప్ర‌సిద్ధి. వారు స్వేచ్ఛా స్ఫూర్తితో అనుసంధానించబడిన మహిళలు. లొంగని సంకల్ప శక్తి .. హద్దులను ఛేదించాలనే అనియంత్రిత కోరికతో ఉన్న‌వారు. ర‌హ‌స్యంగా భయప‌డే పంజరంలో ఉన్నవారిని శపించబడిన వారిని బెదిరించే విచ్. ప్రతిభావంతులైన వ్యక్తులకు కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయని వారిని బూడిద చేయాల‌ని విశ్వసిస్తారు. దుఃఖం చాలా రూపాల్లో ఉంది. అసూయ అనేది అన్నింటికంటే దయనీయమైనది. మీరు అసూయపడాలని లేదా ప్రేరణ పొందాలని ఏదో ఒక‌టి ఎంచుకోవచ్చు.. కానీ తెలివిగా ఎంపిక చేసుకోండి.. ప్రేరణ పొందాలని ఎంచుకునే వారు త‌దుప‌రి ఎంపికల్లో విజ‌యం సాధిస్తారు. పంజరాన్ని విచ్ఛిన్నం చేసి విముక్తి పొందండి`` అని కంగ‌న నోట్ రాసింది. ఈ నోట్ లో తాను ఒక మంత్ర‌గ‌త్తె అని అంగీక‌రించ‌డ‌మే గాక‌, స్వేచ్ఛా జీవిని అని ప్ర‌క‌టించింది కంగన‌. అయితే దీనికి స‌మంత రూత్ ప్ర‌భు త‌న అంగీకారాన్ని మ‌ద్ధ‌తును ప్ర‌క‌టించింది. కంగ‌న పోస్ట్ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసి, ఈ నోట్‌తో ఏకీభవిస్తున్నట్లు స‌మంత `వర్డ్` అనే ప‌దాన్ని జోడించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కంగ‌న ఇటీవ‌ల కొన్ని వ‌రుస ఫ్లాపుల్లో న‌టించింది. ఆస్తులను త‌న‌ఖా పెట్టి ఎమ‌ర్జెన్సీ లాంటి వివాదాస్ప‌ద చిత్ర‌న్ని తెర‌కెక్కించింది. సెన్సార్ ముంగిట చిక్కుల‌ను ఎదుర్కొంది ఈ చిత్రం. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కంగనా రనౌత్ న‌టించిన `ఎమర్జెన్సీ` ఎట్టకేలకు థియేటర్లలోకి వస్తుంది. వాస్తవానికి సెప్టెంబర్ 6న విడుదల కావాల్సిన ఈ పొలిటికల్ డ్రామా సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇప్పుడు మేకర్స్ కొత్త తేదీని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా ఎమర్జెన్సీ విడుద‌ల‌కు అన్ని ఇబ్బందులు క్లియ‌ర్ అయ్యాయ‌ని కంగనా అధికారిక ప్రకటనలో ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో -``మా సినిమా ఎమర్జెన్సీకి స‌ర్టిఫికేట్ అందుకున్నాము. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాము`` అని తెలిపారు.

Witches are women who are connected to their higher self, their intuition, infectious free spirit, indomitable will power and uncontrollable urge to break all boundaries make them mysterious, frightening and threatening to those who are caged and cursed, caged people believe that… https://t.co/cUZRfFJyXL

— Kangana Ranaut (@KanganaTeam) October 19, 2024
Tags:    
  • Samantha 
  • Kanganaranaut 
  • Witches 
  • Women 
  • Kangana 
  • Filmindustry 
  • Emergencymovie 
  • Samantharuthprabhu 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS