20లోని స్వ‌చ్ఛ‌మైన ప్రేమ 30లో క‌నుగొన‌లేం: స‌మంత‌

అయితే 20ల‌లో స్వ‌చ్ఛ‌మైన నిజాయితీతో కూడుకున్న జీవితానికి, 30ల‌లో క‌ల్మ‌ష జీవితానికి మ‌ధ్య తేడా ఏమిటో గ్ర‌హించిన‌ట్టుంది. అందుకే స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో సుదీర్ఘ‌మైన వ‌చ‌న‌క‌విత రూపంలో త‌న మ‌న‌సులో ఉన్న భావోద్వేగాన్ని బ‌య‌ట‌పెట్టింది.;

Update: 2025-10-03 03:58 GMT

`ఏ మాయ చేసావే` సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది స‌మంత‌. ఇప్పుడు సామ్ 38 వ‌య‌సుకు చేరుకుంది. 20 ప్ల‌స్ లో సినీరంగంలో అడుగుపెట్టిన స‌మంత ప‌రిణ‌తి చెందిన న‌టిగా ఎదిగింది. 30ల‌లో స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఏల‌డ‌మే గాక‌, ఇప్పుడు 40 కి చేరువ‌లో బాలీవుడ్ లోను ఏలాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

అయితే 20ల‌లో స్వ‌చ్ఛ‌మైన నిజాయితీతో కూడుకున్న జీవితానికి, 30ల‌లో క‌ల్మ‌ష జీవితానికి మ‌ధ్య తేడా ఏమిటో గ్ర‌హించిన‌ట్టుంది. అందుకే స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో సుదీర్ఘ‌మైన వ‌చ‌న‌క‌విత రూపంలో త‌న మ‌న‌సులో ఉన్న భావోద్వేగాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఇది ఆవేద‌న‌తో కూడుకున్న విస్మ‌యంతో కూడుకున్న ప్ర‌యాణం అని అంద‌రికీ అర్థ‌మ‌యేలా చెప్పింది. 20ల‌లో ఉన్న స్వ‌చ్ఛ‌త ప్రేమ‌లో కానీ, అందంలో కానీ ఇంకెందులోను ఉండ‌ద‌నే స‌మంత ఉద్ధేశాన్ని బ‌య‌ట‌కు చెప్పింది. 20ల‌లో గ‌జిబిజి గంద‌ర‌గోళ జీవితం గురించి వివ‌రించిన స‌మంత అలా ఇత‌ర అమ్మాయిల‌కు జ‌ర‌గ‌కూడ‌ద‌ని కోరుకుంది. 30ల‌లో కూడా అలాంటి స్వ‌చ్ఛ‌త‌ను నిజాయితీని ప్రేమ‌లో, అందంలో క‌నుగొనాల‌నే స‌మంత త‌ప‌న‌ను ఈ క‌వితాత్మ‌క ర‌చ‌న బ‌య‌ట‌పెట్టింది. 20ల‌లో ఉన్న‌ది 30ల త‌ర్వాత క‌నిపించ‌ద‌నే త‌న ఉద్ధేశాన్ని స‌మంత ఎక్క‌డా దాచుకోలేదు. కానీ తాను రెండు ముఖాలు లేకుండా ఒకే ముఖంతో జీవించ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాన‌ని కూడా వెల్ల‌డించింది.

నాగ చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత ఫ్యామిలీమ్యాన్ సిరీస్ డైరెక్ట‌ర్ రాజ్ నిడిమోరుతో స‌మంత‌ డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు వ‌స్తున్న నేప‌థ్యంలో `నిజమైన ప్రేమ`ను కనుగొనడం గురించి స‌మంత భావోద్వేగం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. స‌మంత క‌వితాత్మ‌క మ‌న‌సును సోష‌ల్ మీడియా క‌వ‌నంలో ఇలా ఆవిష్క‌రించింది.

ఈ ప్ర‌పంచం చెబుతుంది.. 30 తర్వాత ప్రతిదీ క్షీణించిందని. మీలో షైన్ మసకబారుతుంది.. అందం జారిపోతుంది.. కానీ 20లలో ప్రతిదీ సాధించ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ పరుగెత్తాలి. పరిపూర్ణ ముఖం, పరిపూర్ణ శరీరం, పరిపూర్ణ జీవితం… సమయం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. నా ఇరవైలు విశ్రాంతి లేకుండా ఉన్నాయి. నేను వాటిని తొందరలో గడిపాను. తగినంత ఉత్త‌మంగా కనిపించడానికి తొందరపడ్డాను. నేను ఇప్పటికీ సంపూర్ణంగా ఉన్నానని ఎవరూ నాకు చెప్పలేదు. ప్రేమ… నిజమైన ప్రేమ… నేను ఎప్పుడూ ఉండకూడని వ్యక్తిగా నన్ను నేను మార్చుకోకుండా, నన్ను నేను ఉన్నట్లుగానే కనుగొంటానని ఇర‌వైలో ఎవరూ నాకు చెప్పలేదు..

అప్పుడు నా ముప్పైలు వచ్చాయి. ఏదో మెత్తబడింది. ఏదో ఓపెనైంది. పాత తప్పుల భారాన్ని లాగడం మానేశాను. నేను సరిపోలడానికి ప్రయత్నించడం మానేశాను. నేను రెండు జీవితాలను గడపడం మానేశాను… నేను ప్రపంచానికి చూపించిన జీవితాలు ..నేను నిశ్శబ్దంగా జీవించిన జీవితాలు. అకస్మాత్తుగా బ‌య‌టి వ్యక్తి ఎవరూ చూడనప్పుడు.. నేను ఇప్పటివరకు అనుభవించిన అత్యంత సజీవమైనది అదే. ప్రతి అమ్మాయికి నేను దీన్ని కోరుకుంటున్నాను. నేను ఆమెలో సంపూర్ణతను కోరుకుంటున్నాను. ఆమె పరిగెత్తడం మానేసి చివరకు తన ఇంటికి వచ్చినప్పుడు వచ్చే శాంతిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు పూర్తిగా మీరే అయినప్పుడు... క్షమాపణ లేకుండా, మారువేషం లేకుండా... మీరు మిమ్మల్ని మీరు విడిపించుకోరు. మీరు మొత్తం ప్రపంచాన్ని విడిపించారు`` అని స‌మంత క‌వితాత్మ‌కంగా త‌న హృద‌యాన్ని ఆవిష్క‌రించంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, రాజ్ & డికె తెర‌కెక్కిస్తున్న `రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్‌డమ్` షూటింగ్‌లో సమంత‌ బిజీగా ఉంది. ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బి త‌దిత‌రులు ఇందులో న‌టిస్తున్నారు 2026లో ఈ సిరీస్ స్ట్రీమింగ్అవుతుంది.

Tags:    

Similar News