అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై స్టార్ హీరో పంచ్‌

అగ్ర‌రాజ్యం అమెరికా దుర‌హంకారం గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. ప్ర‌పంచ దేశాల సార్వ‌భౌమాధికారాన్ని కాల‌రాసేందుకు ట్రంప్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కావడం లేదు;

Update: 2025-09-07 21:30 GMT

అగ్ర‌రాజ్యం అమెరికా దుర‌హంకారం గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. ప్ర‌పంచ దేశాల సార్వ‌భౌమాధికారాన్ని కాల‌రాసేందుకు ట్రంప్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కావడం లేదు. ముఖ్యంగా త‌మ శ‌త్రుదేశం ర‌ష్యాతో భార‌త్ ఆయిల్ వ్యాపారం పూర్తిగా త‌న‌ క‌నుస‌న్న‌ల్లో జ‌ర‌గాల‌ని హెచ్చ‌రించిన ట్రంప్ దానికి వ్య‌తిరేకించిన‌ భార‌త్ పై 50శాతం సుంకాల‌ను విధించాడు.

ఓవైపు ప్ర‌పంచ శాంతి దూత‌ను నేను! అంటూ ప్ర‌చారం చేసుకుంటున్న ట్రంప్, ప‌హ‌ల్గామ్ దాడి అనంత‌రం ఇండియా- పాక్ యుద్ధాన్ని తానే ఆపాన‌ని నోబెల్ శాంతి బ‌హుమ‌తి ద‌క్కాల‌ని ఆశిస్తున్న‌ట్టు అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. కానీ ఈ క‌ల క‌ల‌గానే మిగిలిపోయింది. దుర‌హంకార‌ ట్రంప్ ఎవ‌రిపైనా అజ‌మాయిషీ చేయ‌లేడ‌ని ప్రూవ్ అయింది.

ఇప్పుడు బిగ్ బాస్ 19 తాజా ఎపిసోడ్‌లో హోస్ట్ సల్మాన్ ఖాన్ ప‌రోక్షంగా అమెరికా అధ్య‌క్షుడిపై విమ‌ర్శ‌లు గుప్పించాడు. అత‌డు ఏమ‌న్నాడు? అంటే... ``అస‌లు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది? సమస్యలను వ్యాప్తి చేస్తున్న వారు తమకు శాంతి బహుమతిని కోరుకుంటున్నారు`` అంటూ సింగిల్ లైన్‌లో ట్రంప్ ని విమ‌ర్శించాడు. ఈ కామెంట్ ఆన్‌లైన్‌లో చ‌ర్చ‌ల‌కు దారితీసింది. సల్మాన్ పంచ్ ఎవ‌రిపై అంటే... నోబెల్ శాంతి బహుమతిని పొందేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్‌ గురించేన‌న్న చ‌ర్చ సాగుతోంది.

భారత్-పాకిస్తాన్ మ‌ధ్య‌ యుద్ధ‌ విరమణ ప్రయత్నాలు చేసాన‌ని, జూన్‌లో నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ కోసం ట్రంప్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మద్దతు కోరినట్లు క‌థ‌నాలొచ్చాయి. మోడీ ఆ అభ్యర్థనను తిరస్కరించారని, కాల్పుల విరమణ దేశాల మ‌ధ్య‌ పరస్పర అంగీకారానికి సంబంధించిన‌ద‌ని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కానీ దుర‌హంక‌ర ట్రంప్‌పై ఇప్పుడు ఖాన్ విసిరిన పంచ్ సూటిగా ఎక్క‌డో తాకింది. బిగ్ బాస్ హౌస్ లో శాంతి దూత డ్రామాను ర‌క్తి క‌ట్టిస్తున్న క్ర‌మంలో ఇంటి స‌భ్యుల లోపాల గురించి మాట్లాడిన స‌ల్మాన్, ఇప్పుడు అదే పాయింట్ ని ఉప‌యోగించుకుని ట్రంప్ పై పంచ్ విసిరాడు. టైమింగ్ అలా సెట్ట‌యింది. న‌టుడిగా కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే, సికింద‌ర్ త‌ర్వాత త‌దుప‌రి గ‌ల్వాన్ లోయ యుద్ధం నేప‌థ్యంలో దేశ‌భ‌క్తి చిత్రంలో స‌ల్మాన్ న‌టిస్తున్నారు. ఈ సినిమా ఖాన్ కి బిగ్ బ్రేక్ ని ఇస్తుందని అభిమానులు ఊహిస్తున్నారు.

Tags:    

Similar News