ఐదేళ్లు ఖాళీగా ఉన్న డైరెక్టర్ తో స్టార్ హీరో సినిమా!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి సరైన బ్లాక్ బస్టర్ చాలా కాలమవుతోంది. భారీ యాక్షన్ చిత్రాలు చేస్తున్నా కలిసి రావడం లేదు.;
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి సరైన బ్లాక్ బస్టర్ చాలా కాలమవుతోంది. భారీ యాక్షన్ చిత్రాలు చేస్తున్నా కలిసి రావడం లేదు. దీంతో బాలీవుడ్ డైరెక్టర్లకు బ్రేక్ ఇచ్చి మురగదాస్ తో 'సికిందర్' చేసిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కూడా సల్మాన్ ఖాన్ ని తీవ్ర నిరాశపరిచింది. అలా డైరెక్టర్ ని ఛేంజ్ చేసినా సరే హిట్ మాత్రం దక్కలేదు.
ప్రస్తుతం '7 డాగ్స్' అనే సినిమా చేస్తున్నాడు. ఇదొక సౌదీ అరేబియా-ఈజిప్ట్ చిత్రం. ఈ సినిమాను బాలీవుడ్ చిత్రంగా పరిగణించాల్సి పనిలేదు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఫాంలో ఉన్న డైరెక్టర్లందర్నీ పక్కనబెట్టి ఫాం కోల్పోయిన డైరెక్టర్ ని తెరపైకి తెస్తున్నాడు. తదుపరి చిత్రాన్ని అపూర్వ లాఖితా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇదొక మిలటరీ బ్యాక్ డ్రాప్ స్టోరీగా భారీ వార్ చిత్రంగా తె రపైకి తెస్తున్నారు.
కొన్ని వాస్తవ సంఘటల స్పూర్తితో ఈ కథ సిద్దమైనట్లు వినిపిస్తుంది. ఇందులో హీరోయిన్ గా చిత్రాంగదా సింగ్ ఎంపికైంది. అయితే అపూర్వ లాఖియా డైరెక్టర్ గా సినిమా చేసి ఏడేనిమిదేళ్లు అవుతుంది. చివరిగా ఆయన డైరెక్ట్ చేసిన 'హసీనా పార్కర్' 2017లో రిలీజ్ అయింది. ఆ తర్వాత డైరెక్టర్ గా ఛాన్సులు లేకపోవడంతో వెబ్ సిరీస్ ల వైపు టర్న్ తీసుకున్నాడు. అదీ మూడేళ్ల తర్వాత .
2020 లో 'క్రాక్ డౌన్' అనే వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. 'ముంబై' అనే మరో వెబ్ సిరీస్ కు రైటర్ గానూ పనిచేసాడు. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాడు. మళ్లీ సల్మాన్ ఖాన్ ఇంతకాలానికి వెతికి పట్టుకుని మరీ అతడిని తెరపైకి తేవడంతో అపూర్వ లాఖియా పేరు వైరల్ గా మారిం ది. ఇదే దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'జంజీర్' చిత్రాన్ని 'తుఫాన్' టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇదీ కూడా భారీ డిజాస్టర్. ఆ ప్లాప్ తర్వాత రామ్ చరణ్ హిందీ సినిమా ఆలోచన విరమించుకున్నాడు.