స‌ల్మాన్ ఖాన్ ప్ర‌వ‌ర్త‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాజాగా స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి ఒకే భ‌వంతిలో నివ‌శించిన ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కక్కర్ ఈ జంట‌ విడిపోవడానికి కార‌ణాల‌ను తెలిపారు.;

Update: 2025-09-17 16:57 GMT

ప్రేయ‌సిని నువ్వు నా సొంతం అని అనుకోవ‌డం వ‌ర‌కూ ఓకే కానీ, నేను చెప్పింది విన‌క‌పోతే..! అని హెచ్చ‌రించేంత రాక్ష‌స ప్రేమ కొంద‌రికే ఉంటుంది. అలాంటి రాక్ష‌స ప్రేమ కార‌ణంగానే స‌ల్మాన్ ఖాన్ ఇప్ప‌టికీ బ్యాచిల‌ర్ గా ఉన్నాడ‌ని అత‌డి స‌న్నిహితులు కొంద‌రు వివ‌రించిన సంద‌ర్భాలున్నాయి. ముఖ్యంగా స‌ల్మాన్ ఖాన్ నుంచి ఐశ్వ‌ర్యారాయ్ విడిపోవ‌డానికి కార‌ణం కూడా ఇదే. అత‌డు ఐశ్వ‌ర్యారాయ్ ని పిచ్చిగా ప్రేమించ‌డంతో త‌న‌ విష‌యంలో చాలా అభ‌ద్ర‌తా భావానికి గుర‌య్యాడు. ఐష్‌తో ప్రేమ‌లో ఉన్న కాలంలో ఎప్పుడూ త‌న‌ని వెంబ‌డించేవాడ‌ని కూడా ప్ర‌ముఖ నిర్మాత వెల్ల‌డించారు. ఐశ్వ‌ర్యారాయ్ ని కొట్టేవాడు తిట్టేవాడు..ఇలాంటివి ఎవ‌రు స‌హిస్తారు? అని అన్నాడు.

తాజాగా స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి ఒకే భ‌వంతిలో నివ‌శించిన ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కక్కర్ ఈ జంట‌ విడిపోవడానికి కార‌ణాల‌ను తెలిపారు. అత‌డు ఎప్పుడూ నువ్వు నా సొంతం అనే అబ్సెష‌న్‌లో ఉండేవాడు. పైగా ఐష్ ని శారీర‌కంగాను హింసించేవాడ‌ని కూడా అత‌డు వెల్ల‌డించాడు. ఐశ్వ‌ర్యారాయ్ సైతం ఈ విష‌యాన్ని ప‌లు ఇంట‌ర్వ్యూల్లో స్వ‌యంగా వెల్ల‌డించారు. త‌న గ‌త సంబంధం బ్రేక్ అవ్వ‌డానికి కార‌ణాన్ని ఐష్ బ‌హిరంగంగానే చెప్పింది.

స‌ల్మాన్ ఖాన్ ఐశ్వ‌ర్యారాయ్ ని ఇబ్బందుల‌కు గురి చేసేవాడు. అబ్సెసివ్‌గా ఉండేవాడు. అలాంటి వారితో ఎవ‌రైనా ఎలా క‌లిసి ఉండ‌గ‌ల‌రు? అని కక్కర్ తాజా ఇంటర్వ్యూలో ప్ర‌శ్నించారు. ఈ జంట విడిపోయే స‌మ‌యంలో అదే భ‌వనంలో తాను నివ‌శించాన‌ని చెప్పాడు. ఐష్ పై స‌ల్మాన్ శారీర‌క హింస‌కు దిగాడు. నిజానికి స‌ల్మాన్-ఐష్ జంట అధికారికంగా విడిపోవ‌డానికి చాలా ముందే మాన‌సికంగా దూర‌మ‌య్యారు. ఇది అందరికీ, ముఖ్యంగా ఐష్ కు, ఆమె తల్లిదండ్రులకు, మొత్తం ప్రపంచానికి ఉపశమనం కలిగించింది.. అని తెలిపారు.

అయితే స‌ల్మాన్ నుంచి ఐశ్వ‌ర్యారాయ్ విడిపోయాక ప‌రిశ్ర‌మ నుంచి అవ‌కాశాల్ని కోల్పోయింది. చాలా మంది స‌ల్మాన్ కి మాత్ర‌మే మ‌ద్ధ‌తుగా నిలిచారు. ఐశ్వ‌ర్యారాయ్ ఒంట‌రి అయింది. ఒంట‌రి పోరాటం కార‌ణంగా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో నెమ్మ‌దిగా ప‌రిశ్ర‌మ‌పై ఐష్ న‌మ్మ‌కాన్ని కోల్పోయింద‌ని క‌క్క‌ర్ తెలిపారు.

స‌ల్మాన్ - ఐశ్వర్య `హమ్ దిల్ దే చుకే సనమ్` (1999) చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డారు. కానీ 2002లో రిలేష‌న్ ముగిసింది. బ్రేక‌ప్ వార్త‌లు సంచ‌ల‌నం అయ్యాయి. తరువాత 2007లో అభిషేక్ బచ్చన్‌ను ఐష్‌ వివాహం చేసుకునే ముందు వివేక్ ఒబెరాయ్‌తో డేటింగ్ చేసింది. సల్మాన్ ఖాన్ నేటికీ ఒంటరిగానే మిగిలాడు.

Tags:    

Similar News