బాక్సాఫీస్.. ఈ రెండు సినిమాల లెక్క ఏ లెవెల్లో ఉందంటే..

ఇప్పుడు వీకెండ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద రెండు చిత్రాలు కూడా భారీ వసూళ్లను అందుకుని దూసుకుపోతున్నాయి.;

Update: 2025-07-28 12:37 GMT

థియేటర్స్ కు వెళ్తాం.. కంటెంట్ ఉంటే కచ్చితంగా వెళ్తాం.. అని ఇప్పటికే పలుమార్లు నిరూపించిన సినీ ప్రియులు.. మరోసారి ప్రూవ్ చేశారు. కంటెంట్ బాగుంటే జై కొడతామని ఇంకోసారి చేసి చూపించారు. ఇప్పుడు సైయారా.. మహవతార్ నరసింహా చిత్రాలు అదే కోవలోకి వస్తాయి. రెండు సినిమాలూ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి.

ఇప్పుడు వీకెండ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద రెండు చిత్రాలు కూడా భారీ వసూళ్లను అందుకుని దూసుకుపోతున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ సైయారా గత వారం రిలీజ్ అయినా.. ఇప్పటికే అదే జోష్ తో సందడి చేస్తోంది. పాన్ ఇండియా ఫిల్మ్ మహావతార్ నరసింహ 4రోజుల క్రితమే వచ్చి అందరినీ మెప్పిస్తోంది.

కొత్త హీరో, హీరోయిన్లు అహాన్ పాండే, అనీత్ ప‌ద్దా జంట‌గా న‌టించిన సైయారా.. బాక్సాఫీస్ వ‌ద్ద రూ.200 కోట్లు వ‌సూలు చేసి రూ.300 కోట్ల క్ల‌బ్ వైపు పరుగులు పెడుతోంది. 2025లో చావా త‌ర్వాత బాక్సాఫీస్ వ‌ద్ద అతిపెద్ద హిట్ గా నిలిచింది. క్యాస్టింగ్ యాక్టింగ్, మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్, టేకింగ్.. ఇలా ప్ర‌తిదీ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

మొదటి వారం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన సైయారా ఇప్పుడు అదే స్పీడ్ లో ఉంది. నార్త్ లో ఇంకా ఆడియన్స్ ను రప్పిస్తూనే ఉంది. శని, ఆదివారాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. నార్త్ మూవీ లవర్స్ కు సైయారా మొదటి ఎంపికగా మారింది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో కూడా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది.

మరోవైపు, ప్రముఖ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేషన్ మహావతార్ నరసింహ చిన్న సినిమాగా విడుదలవ్వగా.. మౌత్ టాక్ మూవీని విజేతగా నిలిపింది. భక్త ప్రహ్లాదుడి కథతో వచ్చిన సినిమా వీఎఫ్ ఎక్స్ వర్క్ కు అంతా ఫిదా అవుతున్నారు. థియేటర్స్ కు ప్రజలు క్యూ కడుతున్నారు. దీంతో స్క్రీన్ల సంఖ్య రెట్టింపు అయింది.

శుక్రవారం నుంచి ఆదివారం వరకు మహావతార్ నరసింహ ప్రేక్షకుల సంఖ్య, బాక్సాఫీస్ సంఖ్యల్లో 400 శాతం పెరుగుదల కనిపించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇది చాలా పెద్ద విజయంగా చెబుతున్నాయి. నార్త్ లో కూడా మల్టీప్లెక్స్‌ లు షోస్ కౌంట్ ను పెంచాయి. నిన్న ఒక్క రోజే రూ.11.25 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అలా సైయారా, మహావతార్ నరసింహ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో ఉన్నాయి.

Tags:    

Similar News