• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు...

సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు ఘటన.. బెయిల్ కోసం పాట్లు..

| బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై క‌త్తిపోట్ల కేసులో నిందితుడికి ఇంకా బెయిల్ రాలేదు. అత‌డు బెయిల్ కోసం కోర్టులో అర్థిస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2025-03-29 07:55 GMT

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై క‌త్తిపోట్ల కేసులో నిందితుడికి ఇంకా బెయిల్ రాలేదు. అత‌డు బెయిల్ కోసం కోర్టులో అర్థిస్తున్నాడు. బాంద్రా ఇంట్లో దొంగతనం ప్రయత్నం సందర్భంగా నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్ర‌తిఘ‌టించ‌గా, త‌న‌పై దాడి చేసాడంటూ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ పై కేసు పెట్టారు. అత‌డు ముంబై సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. తన న్యాయవాది అజయ్ గవాలి ద్వారా సమర్పించిన తన పిటిషన్‌లో షెహజాద్ తాను నిర్దోషినని, తనపై కేసు కల్పితమని పేర్కొన్నాడు. ఎఫ్‌ఐఆర్ సరిగ్గా నమోదు చేయలేదని బెయిల్ దరఖాస్తులో ఆరోపించాడు.

షెహజాద్ దర్యాప్తున‌కు పూర్తిగా సహకరించాడని, అన్ని ఆధారాలు ఇప్పటికే పోలీసుల వద్ద ఉన్నాయని, దీనివల్ల ఎలాంటి ట్యాంపరింగ్ జరగడం అసాధ్యమని కూడా పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ కేసు ప్రస్తుతం బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత దీనిని సెషన్స్ కోర్టుకు బదిలీ చేస్తారు. తాజా స‌మాచారం మేర‌కు... బాంద్రా పోలీసులు ఇంకా చార్జిషీట్ సమర్పించలేదు.

జ‌న‌వ‌రిలో జ‌రిగిన దాడిలో సైఫ్ కి ప‌లు చోట్ల గాయాల‌య్యాయి. సైఫ్ ఖాన్ ఇంట్లో దొంగ‌త‌నం చేసే స‌మ‌యంలో సైఫ్ ప్ర‌తిఘ‌టించ‌గా.. షెహ‌జాద్ అత‌డిపై దాడి చేసాడు. ఛాతీ వెన్నెముక శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సైఫ్ ని లీలావతి ఆసుపత్రికి తరలించ‌గా ఐదు రోజులు చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డిన జనవరి 21న డిశ్చార్జ్ అయ్యాడు. ఫిబ్రవరిలో ముంబై పోలీసులు అరెస్టు చేసిన నిందితుడిపై తమ వద్ద తగినంత ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అతడు బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి ప్రవేశించి ముంబైకి వచ్చే ముందు కోల్‌కతాలోని ప‌లు చోట్ల ఉన్నాడని కూడా అధికారులు ధృవీకరించారు.

అయితే ఈ కేసులో నిందితుడు వేరొక‌రు ఉన్నార‌ని, ఇత‌డి వేలి ముద్ర‌లతో ఘ‌ట‌నా స్థ‌లంలోనివి స‌రిపోల‌డం లేద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. అయితే దీనిని అదనపు పోలీసు కమిషనర్ పరంజిత్ సింగ్ దహియా ఖండించారు. నిందితుడి వేలిముద్రలు సరిపోలడం లేదనే పుకార్లను క‌మీష‌న‌ర్ తోసిపుచ్చారు. ఏదైనా కేసులో ఇలాంటి పుకార్లు స‌హ‌జ‌మ‌ని నిందితుడి ప్ర‌మేయానికి సంబంధించిన అన్ని ఆధారాల‌ను సేక‌రించామ‌ని తెలిపారు. సాంకేతికంగా భౌతికంగా మేము సరైన వ్యక్తిని పట్టుకున్నాము అని ఆయన అన్నారు.

Tags:    
  • SaifAliKhan 
  • AssaultCase 
  • Bail 
  • MumbaiCourt 
  • SaifAliKhanStabbed 
  • MumbaiPolice 
  • SharifulFakir 
  • SharifulFakirBail 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS