తేజ్ మాస్ సంబరాలు.. ఫ్యాన్స్ కి పండగేనా..?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సంబరాల యేటి గట్టు. రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుంది.;

Update: 2025-06-06 15:14 GMT

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సంబరాల యేటి గట్టు. రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుంది. సినిమా టైటిల్ గ్లింప్స్ తోనే ఒక హైప్ తెచ్చిన తేజ్ సినిమాతో భారీ ప్లానింగ్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది. తేజ్ సంబరాల యేటిగట్టు సినిమాలో యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తాయని అంటున్నారు. సినిమాలో మాస్ సంబరాలు ఫ్యాన్స్ కి పండగ చేసుకునేలా ఉంటాయట.

ఈ సినిమా కథ కథనం యాక్షన్ సీన్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయని అంటున్నారు. తేజ్ సినిమాల్లో ఇప్పటివరకు రాని విధంగా సంబరాల యేటిగట్టు మాస్ మేనియా ఉంటుందని తెలుస్తుంది. సంబరాల యేటిగట్టు సినిమా లో తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

మెగా ఫ్యాన్స్ కి ఇష్టమైన యువ హీరో సాయి తేజ్. అందుకే అతని సినిమాలను వారు ఎంకరేజ్ చేస్తారు. ఐతే మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా కూడా మళ్లీ తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు సాయి తేజ్. బ్రో తర్వాత తేజ్ చేస్తున్న సంబరాల యేటిగట్టు సినిమా మెగా హీరో నుంచి రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది. మరి ఈ సినిమా తేజ్ కోరిక తీస్తుందా లేదా అన్నది చూడాలి.

సాయి తేజ్ లోని మాస్ మేనియాని నూతన దర్శకుడు రోహిత్ పర్ఫెక్ట్ గా పట్టేశాడని అంటున్నారు. సినిమా రషెస్ చూసి తేజ్ అండ్ మిగతా టీం కూడా సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారట. మరి ఈ మూవీతో తేజ్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. మెగా మేనమామల ఎనర్జీని మ్యాచ్ చేస్తూ తేజ్ తెరంగేట్రం చేసిన అతి తక్కువ టైం లోనే మెగా ఫ్యాన్స్ కి దగ్గర కాగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అన్నది చూడాలి. మెగా హీరోల్లో తిరిగి ఫాం లోకి రావాల్సిన హీరోల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఐతే తేజ్ సంబరాల యేటిగట్టుతో మాత్రం తప్పకుండా ఒక రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News