పెళ్లి చేసుకున్న ప్ర‌తి ఒక్క‌రూ చెప్పేది అదే!

సాయి ప‌ల్ల‌వి..న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తూ కోలీవుడ్ టు బాలీవుడ్ వ‌ర‌కు టాప్ సెల‌బ్రిటీస్‌ని ఆక‌ట్టుకుంటోంది.;

Update: 2026-03-28 15:30 GMT

సాయి ప‌ల్ల‌వి..న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తూ కోలీవుడ్ టు బాలీవుడ్ వ‌ర‌కు టాప్ సెల‌బ్రిటీస్‌ని ఆక‌ట్టుకుంటోంది. సినిమాల‌ ఎంపిక ప‌రంగానే అంద‌రికి భిన్నంగా, ప్ర‌త్యేకంగా అడుగులు వేస్తూ త‌ను చాలా స్పెష‌ల్ అని నిరూపించుకుంటోంది. సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్‌గా స‌రికొత్త ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తూ ఏ హీరోయిన్‌కి ద‌క్క‌ని ఫీట్‌ని సుసాధ్యం చేసుకుని ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది. ప్ర‌తి హీరోయిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అన‌ద‌గ్గ క్యారెక్ట‌ర్‌, సినిమాల్లో న‌టించాల‌ను గోల్ ఉంటుంది.

అలాంటి గోల్‌ని అవ‌లీల‌గా రీచ్ అయిన సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం యావ‌త్ దేశం వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల‌తో పాటు వ‌ర‌ల్డ్ సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న `రామాయ‌ణ‌`లో సీత‌గా న‌టిస్తోంది. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫ‌స్ట్ పార్ట్ ఈ ఏడాది దీపావ‌ళికి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే రామాయ‌ణ గాధ నేప‌థ్యంలో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. రీసెంట్‌గా ప్ర‌భాస్ `ఆదిపురుష్‌` కూడా రావ‌డం, ప్రేక్ష‌కుల్ని తీవ్ర నిరాశ‌కు గురి చేయ‌డంతో అంద‌రి దృష్టి ఇప్పుడు `రామాయ‌ణ‌`పై ప‌డింది.

వీటితో పాటు ధ‌నుష్ 55వ మూవీ, లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిత్నం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌పైకి తీసుకొస్తున్న రొమాంటిక్ ల‌వ్ స్టోరీల‌లో న‌టిస్తున్న సాయి ప‌ల్ల‌వి మ‌రో క్రేజీ బ‌యోపిక్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న‌దైన గాన మాధుర్యంతో ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల్ని, కేంద్ర ప్ర‌భుత్వ బిరుదుల్ని సొంతం చేసుకున్న ఎం.ఎస్‌. సుబ్బ‌ల‌క్ష్మి జీవిత క‌థ ఆధారంగా సంజ‌య్‌ లీలా భ‌న్సాలీ ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుడుతున్నారు. టైటిల్ క్యారెక్ట‌ర్ కోసం సాయి ప‌ల్ల‌విని ఫైన‌ల్ చేసిన‌ట్టుగా వార్ద‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే సాయి ప‌ల్ల‌వి ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లిపై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింది. పెళ్లి ప‌ట్ల త‌న‌కు మంచి అభిప్రాయం ల‌భించ‌లేద‌ని తెలిపింది. ఎవ‌రైతే పెళ్లి చేసుకున్నారో వాళ్లంతా మిగ‌తా వారు పెళ్లి చేసుకోక‌పోవ‌డ‌మే బెట‌ర్ అని చెబుతుంటారు. మ‌ధ్య రాత్రి అన్నం తిన‌కుండా ఏడుస్తూ ఉంటే ఆ టైమ్‌లో నా ప‌క్క‌న కూర్చోవ‌డానికి ఎవ‌రూ సిద్ధంగా ఉండ‌రు. ఒక్క మా అమ్మ త‌ప్ప‌. ఆ టైమ్‌లో నా ప‌క్క‌న కూర్చుంటుంది. త‌ను త‌ప్ప మ‌రెవ‌రూ అలా కూర్చోలేరు.

పెళ్లి అనే బంధం లేక‌పోతే ఇలాంటి అనుభ‌వం ఎవ‌రికీ ఉండ‌దు క‌దా? అంటూ పెళ్లిపై భిన్నాభిప్రాయ‌ల్ని వ్య‌క్తం చేసేవారికి ఇండ‌డైరెక్ట్‌గా సాయి ప‌ల్ల‌వి చుర‌క‌లింటించింది. దీనికి సంబంధించిన ఇంట‌ర్వ్యూ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారి విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇదిలా ఉంటే సాయి ప‌ల్ల‌వి పెళ్లిపై గ‌త కొంత కాలంగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై రీసెంట్‌గా స్పందించిన సాయి ప‌ల్ల‌వి వాటికి చెక్ పెట్టే ప్రయ‌త్నం చేసింది. త‌న దృష్టి మొత్తం ప్ర‌స్తుతం సినిమాల‌పైనే ఉంద‌ని స్ఫ‌ష్టం చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది.

Tags:    

Similar News