సాయి పల్లవి నెక్స్ట్ తెలుగు సినిమా ఏది..?
సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సినిమా చేస్తుందంటే చాలు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.;
సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సినిమా చేస్తుందంటే చాలు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. సాయి పల్లవి ఒక సినిమా సైన్ చేసింది అంటేనే అందులో విషయం ఉంటుందని ఫిక్స్ అవుతారు. ప్రేమం తో పాపులర్ అయిన సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి వరుస సినిమాలు చేస్తూ అమ్మడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే దానికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తూ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చింది సాయి పల్లవి.
చివరగా తెలుగులో తండేల్ సినిమాతో మెప్పించింది సాయి పల్లవి. నాగ చైతన్యతో ఆల్రెడీ లవ్ స్టోరీ సినిమా చేసి సక్సెస్ అందుకున్న సాయి పల్లవి తండేల్ తో మరోసారి సూపర్ అనిపించుకుంది. తండేల్ సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఐతే తండేల్ తర్వాత సాయి పల్లవి మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. బాలీవుడ్ లో రామాయణ్ తో పాటు అక్కడ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా మారింది సాయి పల్లవి.
ఈ క్రమంలో తెలుగు నుంచి వస్తున్న ఆఫర్లు కొన్ని నచ్చకపోగా బాగుంది అనిపించిన కథలను కూడా చేయడానికి డేట్స్ అడ్జెస్ట్ అవ్వట్లేదని తెలుస్తుంది. బలగం వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ సినిమాలో ముందు సాయి పల్లవిని నటింపచేయాలని అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ కుదరక ఆ ఛన్స్ వదులుకోవాల్సి వచ్చింది. సాయి పల్లవి వదిలిన ఆ అవకాశాన్ని మహానటి కీర్తి సురేష్ అందుకుంది.
సాయి పల్లవి నెక్స్ట్ తెలుగు సినిమా ఏది సైన్ చేస్తుందా అని ఆమె ఫ్యాన్స్ లో ఆసక్తి ఏర్పడింది. ఐతే ముందు బాలీవుడ్ లో కమిటైన సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే సౌత్ సినిమాలు చేయాలని చూస్తుంది. తెలుగులోనే సాయి పల్లవి ఏరికోరి నచ్చిన కథలను చేస్తుంది. మిగతా భాషల్లో ఆమెకు అంతగా అవకాశాలు రావట్లేదు. ఐతే సాయి పల్లవి మాత్రం తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న ఈ ప్రేమకు గాను ఎంచుకున్న పాత్రలో ఆమె ది బెస్ట్ ఇస్తూ తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది. తప్పకుండా సాయి పల్లవి మరో సూపర్ హిట్ ప్రాజెక్ట్ తో తెలుగు ఆడియన్స్ ముందుకు రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఆ సినిమా ఏది అవుతుంది.. ఏ స్టార్ తో కలిసి సాయి పల్లవి సినిమా చేస్తుంది అన్నది చూడాలి.