ఎన్టీఆర్ ఫిలాసఫీతో సాయి పల్లవి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైఫ్ కి సంబంధించిన ఫిలాసఫీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ క్షణం ఏంటి? అన్నదే ఆయన ఆలోచిస్తాడు.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైఫ్ కి సంబంధించిన ఫిలాసఫీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ క్షణం ఏంటి? అన్నదే ఆయన ఆలోచిస్తాడు. రేపు ఏం జరుగుతుంది? భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఇలాంటి ఆలోచనలేవి తారక్ మైండ్ లో ఉండవు. అలాంటి ఆలోచనే రానివ్వనంటాడు. ఈ క్షణం ఇప్పుడు ఎలా ఉన్నాం అన్నది ముఖ్యమంటాడు. తాను దాన్ని నమ్మే జీవితంలో ముందుకెళ్తానని చెబుతుంటాడు.
జీవితం నీటి బుడగ లాంటిదని...మనిషి జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు...భూమ్మీదకు ఎలా వచ్చామో..అలాగే కనుమరుగైపోతాం? ఇది నిత్య సత్యంగా భావించే తన ప్రయాణం సాగుతుందంటాడు. తాజాగా సాయి పల్లవి కూడా తారక్ ఫిలాసఫీని అనుసరిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుందని తెలుస్తోంది. 'జీవితంలో ఏదీ శాశ్వతం కాదు..అన్నీ అశాశ్వతమే. ఇప్పుడు ఎంత ప్రేమ ఉన్నది అనేది ముఖ్యం.
ఆ ప్రేమను ఇప్పుడు తీసుకున్నానా? లేదా? అన్నది ఆలోచిస్తాను. అది ఆ క్షణం మాత్రేమే జరగాలి. తీసుకున్న ఆ క్షణం ఆస్వాదించాలి. అంతే గౌరవంగా ఉండాలి. ఈ ప్రేమ కూడా రేపు ఉండదు. అది తర్వాత రోజు మరోలా టర్నింగ్ తీసుకోవొచ్చు. ప్రతీ ఒక్కరి జీవితంలో మార్పు ఒక్కటే స్థిరంగా కనిపిస్తుంది. దానికి మాత్రమే స్థిరత్వం ఉంది. అంతకు మించి మరే అంశానికి స్థిరత్వం ఉండదు.
అందుకే జీవితంలో ఏదీ ఇనిస్టెంట్ గా జరిగినా దాన్ని తీసుకుని ముందుకు వెళ్లిపోవడమే? ఆ క్షణం ప్రేమను తీసుకోకపోయినా? బాధను తీసుకోకపోయినా ? కోల్పోయినట్లే. అందుకే వీలైనంత పాజిటివ్ గా ఉండటం అలవాటు చేసుకున్నాను` అని తెలిపింది. మరి ఉన్నట్లుండి టాలీవుడ్ కి దూరమవ్వడానికి గల కారణం కూడా ఇందులో వెతకొచ్చా? అన్న కొత్త ఆలోచన విశ్లషకుల్లో మొదలైంది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో 'రామాయాణం'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగులో అవకాశాలు వస్తున్నా? రిజెక్ట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.