బాలీవుడ్ డెబ్యూ మంచి మెమొరీగా మారుతుందనుకుంటే..
ఎంత పెద్ద స్టార్ హీరో పక్కన అయినా సరే తనకు పాత్ర నచ్చి, ఆ పాత్రలో నటించే స్కోప్ ఉందనుకుంటేనే సాయి పల్లవి ఆ సినిమాను ఒప్పుకుంటుంది.;
ఎంత పెద్ద స్టార్ హీరో పక్కన అయినా సరే తనకు పాత్ర నచ్చి, ఆ పాత్రలో నటించే స్కోప్ ఉందనుకుంటేనే సాయి పల్లవి ఆ సినిమాను ఒప్పుకుంటుంది. తన పాత్రకు ప్రాధాన్యం లేకుండా వచ్చిన ఎంత భారీ బడ్జెట్ సినిమా ఆఫర్‌నైనా సరే అమ్మడు మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది. భోళా శంకర్ లో మెగా స్టార్ చిరంజీవికి చెల్లిగా నటించే ఛాన్స్ వచ్చినా ఆ సినిమాకు నో చెప్పడానికి రీజన్ ఇదే.
అలా పాత్రకు ప్రాధాన్యం లేకపోవడంతో సాయి పల్లవి నో చెప్పిన సినిమాలెన్నో. లవ్ స్టోరీ, తండేల్, విరాట పర్వం లాంటి సినిమాలకు ఓకే చెప్పింది కూడా ఆ సినిమాల్లో తన పాత్రకు ఉన్న వెయిట్ వల్లే. క్యారెక్టర్ విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరించే సాయి పల్లవికి ఇప్పుడో సమస్య ఎదురైంది. సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది.
అందులో ఒకటి రణ్‌బీర్ కపూర్ తో కలిసి చేస్తున్న ప్రిస్టీజియస్ ప్రాజెక్టు రామాయణం కాగా, మరోటి జునైద్ ఖాన్ కు జోడీగా నటిస్తున్న సినిమా. ఈ రెండింటిలో ముందుగా రామాయణం రిలీజైతే సాయి పల్లవికి కూడా బాలీవుడ్ డెబ్యూ మంచి మెమొరీగా మిగిలేది కానీ ఇప్పుడు జునైద్ తో నటించిన సినిమా ముందు రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు ఏక్ దిన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాలంటున్నాయి.
ఎప్పట్నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఏక్ దిన్ షూటింగ్ ఇప్పుడు ఆఖరి దశకి చేరుకుంది. షూటింగ్ పూర్తవగానే పోస్ట్ ప్రొడక్షన్ కూడా వెంటనే పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ దక్కడం మాత్రం అనుమానమే. దానికి కారణం జునైద్ ఖాన్ మీద ఆడియన్స్ లో నెగిటివ్ ఫీలింగ్ చాలానే ఉంది. అతన్నుంచి వచ్చి మహారాజ, లవ్ యాపా డిజాస్టర్లుగా మిగలడంతో పాటూ అతని నటన కూడా చెప్పుకోదగ్గ రీతిలో లేకపోవడంతో జునైద్ నుంచి రాబోతున్న ఏక్ దిన్ పై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు.
కాబట్టి సినిమా రిలీజయ్యాక ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే అంశాలు రెండే. ఒకటి కంటెంట్, మరోటి సాయి పల్లవి. కథ, అందులో తన క్యారెక్టర్ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే సాయి పల్లవిని ఈ మూవీ ఎంతగానో ఎగ్జైట్ చేసి ఉంటే తప్పించి ఏక్ దిన్ ఒప్పుకుని ఉండదు. ఏదేమైనా సాయి పల్లవికి బాలీవుడ్ లో మంచి డెబ్యూ దక్కుతుందనుకుంటే ఆ సినిమా భారం మొత్తం ఇప్పుడు తనపైనే పడింది. జునైద్ ను చూసి ఆడియన్స్ థియేటర్లకు వచ్చే పరిస్థితుల్లో లేరు. కాబట్టి సాయి పల్లవి తన యాక్టింగ్ తో పాటూ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొని సినిమాను ప్రమోట్ చేస్తే తప్పించి ఏక్ దిన్ గట్టెక్కేలా కనిపించడం లేదు. మరి సాయి పల్లవికి డెబ్యూ మూవీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.