మెగా హీరోతో ప్రభాస్ కజిన్.. క్రేజీ కాంబో!

సాయి దుర్గా తేజ్.. విరూపాక్ష సినిమాతో తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు. మాస్, హార్రర్, థ్రిల్లర్ అని తేడా లేకుండా అన్ని జానర్లలో దూసుకుపోతున్నాడు.;

Update: 2025-12-01 13:23 GMT

సాయి దుర్గా తేజ్.. విరూపాక్ష సినిమాతో తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు. మాస్, హార్రర్, థ్రిల్లర్ అని తేడా లేకుండా అన్ని జానర్లలో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు సడెన్ గా ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా స్టార్ హీరోలు సేఫ్ జోన్ కోసం అనుభవం ఉన్న దర్శకుల వైపు మొగ్గు చూపుతారు. కానీ తేజ్ మాత్రం ఒక డెబ్యూ డైరెక్టర్ ని నమ్మి ఒక పెద్ద ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

అయితే ఆ కొత్త దర్శకుడు ఎవరో నార్మల్ పర్సన్ కాదు. బ్యాక్ గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. టాలీవుడ్ లోని టాప్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి స్వయానా కజిన్ అవుతాడు. అందుకే ఇప్పుడు ఈ కాంబినేషన్ వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక మెగా హీరో, ఆ స్టార్ హీరో కజిన్ డైరెక్షన్ లో సినిమా చేయడం అంటే అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.

అసలు మేటర్ లోకి వెళ్తే.. తేజ్ తన తదుపరి సినిమాను సిద్ధార్థ్ రాజ్ కుమార్ అనే కొత్త దర్శకుడితో చేయబోతున్నాడు. ఈ సిద్ధార్థ్ ఎవరో కాదు, మన రెబల్ స్టార్ ప్రభాస్ కజిన్. గతంలో నటుడిగా పరిచయమైన సిద్ధార్థ్, ఇప్పుడు మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గా మారబోతున్నాడు. ప్రభాస్ ఫ్యామిలీ నుంచి డైరెక్షన్ వైపు వస్తున్న మొదటి వ్యక్తి కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా జానర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉండబోతోంది. ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది. సుప్రీం హీరోని మనం ఈ మధ్య ఎక్కువగా సీరియస్ రోల్స్ లో చూస్తున్నాం. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ లవర్ బాయ్ గా మారి, వింటేజ్ తేజ్ ని గుర్తుచేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ కథలో లవ్, ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయట.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే సెట్స్ పైకి వెళ్ళదు. దీనికి ఇంకా చాలా సమయం ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 2026 మార్చిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈలోపు తేజ్ చేతిలో ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుంటారు. సిద్ధార్థ్ కూడా స్క్రిప్ట్ ను మరింత పకడ్బందీగా సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయిస్తున్నారు.

ఏదేమైనా మెగా కాంపౌండ్ హీరో, రెబల్ స్టార్ కాంపౌండ్ డైరెక్టర్.. వినడానికే ఈ కాంబో చాలా వెరైటీగా ఉంది. ఇండస్ట్రీలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కొలాబరేషన్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి. మరి దర్శకుడిగా మారుతున్న ప్రభాస్ కజిన్, సాయి దుర్గా తేజ్ ని ఎంత కొత్తగా చూపిస్తాడో చూడాలి. ప్రస్తుతం సాయి తేజ్ సంభారాల ఏటిగట్టు సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News