• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'దేవర' కి మెగా హీరో ఆల్‌...

'దేవర' కి మెగా హీరో ఆల్‌ ది బెస్ట్‌

| కనుక ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రతి ఒక్కరు దేవర సినిమా కి ప్రత్యేకంగా విషెస్ చెబుతూ ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2024-09-26 08:05 GMT

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా సందడి చేసేందుకు సిద్ధం అయింది. యూఎస్ లో ప్రీమియర్ లకు అంతా సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రమే కాకుండా దాదాపు అందరు హీరోల అభిమానులూ సినిమా కోసం వెయిట్ చేస్తున్నామంటూ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కనుక ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రతి ఒక్కరు దేవర సినిమా కి ప్రత్యేకంగా విషెస్ చెబుతూ ఉన్నారు.

తాజాగా ఎన్టీఆర్‌ దేవర సినిమా విడుదల నేపథ్యంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ ఎక్స్ ద్వారా తన బెస్ట్‌ విషెష్‌ ను తెలియజేశారు. తారక్ అన్న, చాలా రోజుల వెయిటింగ్‌ తర్వాత నీ నుంచి అతి పెద్ద భారీ చిత్రం రేపు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎప్పుడు చూస్తానా అంటూ చాలా ఆతృతగా ఉన్నాను. కచ్చితంగా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ సాయి ధరమ్‌ తేజ్ ట్వీట్‌ చేశారు. చిత్ర యూనిట్ సభ్యుల అందరి పేర్లను ప్రస్థావిస్తూ సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

గతంలో సాయి ధరమ్‌ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా కి ఎన్టీఆర్‌ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెల్సిందే. అంతే కాకుండా సినిమా సాయి ధరమ్‌ తేజ్ పై క్లాప్ కొట్టి సినిమాను ఎన్టీఆర్‌ ప్రారంభించారు. ఎన్టీఆర్‌ అంటే సాయి ధరమ్‌ తేజ్ కి ప్రత్యేకమైన అభిమానం. అందుకే తన సినిమాల కోసం పలు సార్లు ఎన్టీఆర్‌ ని ముందు నిలిపిన సాయి ధరమ్‌ తేజ్ ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమా దేవర కోసం తాను ముందుకు వచ్చి మరీ బెస్ట్‌ విషెష్ చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం అంటూ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ దేవర సినిమా ను నందమూరి కళ్యాణ్ రామ్‌, సుధాకర్‌ చెరుకూరి లు సంయుక్తంగా నిర్మించారు. దాదాపు ఈ సినిమాకు రూ.400 కోట్ల బడ్జెట్ ను వారు ఖర్చు చేశారనే వార్తలు వస్తున్నాయి. సినిమా బడ్జెట్‌ కి ఏమాత్రం తగ్గకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కేవలం థియేట్రికల్ వసూళ్ల ద్వారానే నిర్మాతలకు లాభాల పంట పండే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఇతర రైట్స్ ద్వారా దేవర నిర్మాతలకు మరింత లాభాల పంట పండే అవకాశాలు ఉన్నాయి. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో బాలీవుడ్‌ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌ కీలక పాత్రలో నటించారు. ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీ ఖాన్ కాంబో సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయట.

Dear Tarak @tarak9999 . It has been a long wait, but you’re finally coming with a massive entertainer tomorrow, and I can’t wait to see it@NANDAMURIKALYAN anna, @anirudhofficial and #KoratalaSiva garu Wishing you the biggest blockbuster and nothing less than that

Wishing… pic.twitter.com/fUfWoyVZEx

— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 26, 2024
Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • Devara 
  • Ntr 
  • Janhvikapoor 
  • Saifalikhan 
  • Kalyanram 
  • KoratalaSiva 
  • SaiDharmatej 
  • Tweet 
  • Socialmedia 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS