మెగా మేనల్లుడు స్పీడ్ పెంచాల్సిందే..!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సంబరాల యేటిగట్టు సినిమా చేస్తున్నాడు.;
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సంబరాల యేటిగట్టు సినిమా చేస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత కెరీర్ లో కాస్త వెనకపడిన తేజ్ విరూపాక్షతో హిట్ అందుకున్నా బ్రో సినిమాతో జస్ట్ యావరేజ్ అనిపించుకున్నాడు. ఐతే నూతన దర్శకుడు రోహిత్ తో తేజ్ కలిసి చేస్తున్న సంబరాల యేటిగట్టు సినిమా పీరియాడికల్ మూవీగా రాబోతుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. సాయి తేజ్ కెరీర్ లోనే భారీ యాక్షన్ సినిమాగా ఇది వస్తుందని అర్ధమవుతుంది. సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ రోజే రిలీజైన వీడియో క్రేజీగా అనిపించింది.
ఐతే సంబరాల యేటిగట్టు సినిమా షూటింగ్ జరుపుకుంటున్నా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రావట్లేదు. ఆ టైటిల్ టీజర్ దగ్గర నుంచి చిత్ర యూనిట్ మళ్లీ కనిపించలేదు. తేజ్ కూడా ఈమధ్య బయట ఎక్కడ కనిపించినట్టు లేదు. సినిమా పూర్తి చేసే వరకు ఎవరికీ కనిపించకూడదు అనుకున్నాడో ఏమో కానీ తేజ్ మాత్రం సంబరాల యేటిగట్టు సినిమాతో మరోసారి తనలోని ఎనర్జీని చూపించాలని ఫిక్స్ అయ్యాడు.
తేజ్ సంబరాల యేటిగట్టు సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. కేవలం హీరోయిన్ గానే కాదు ఐశ్వర్య సినిమాలో ఉంది అంటే యాక్షన్ సపోర్ట్ కూడా ఉంటుందని అర్ధమవుతుంది. ఐతే సినిమాను త్వరగా పూర్తి చేసి దసరా రేసులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కానీ సినిమా ఎంతవరకు పూర్తైంది అన్నది కూడా తెలియట్లేదు.
తేజ్ మాత్రం ఈ సినిమా మీద పూర్తి ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. సంబరాల యేటిగట్టు సినిమాతో సాయి తేజ్ భారీ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ సినిమాకు షిఫ్ట్ అవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే తేజ్ ఈ సినిమా పూర్తి చేసే వరకు తర్వాత సినిమా ఏంటన్నది కూడా క్లారిటీ తెచ్చుకోలేదు. అసలు నెక్స్ట్ సినిమాకు కథలు వింటున్నాడా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. సంబరాల యేటిగట్టు సక్సెస్ కొడితే మాత్రం సాయి ధరం తేజ్ తిరిగి మాస్ ఫాంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సినిమాను రిలీజ్ ముందే ప్రమోషన్స్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.