ఆ కన్నడ భామ సౌత్ లో చక్రం తిప్పుతుందా?
రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఆమె పలు భాషల్లో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా మారిపోయారు. 2019లో బీర్బల్ ట్రయాలజీ సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టిన రుక్మిణి ఆ తర్వాత బాలీవుడ్ లో అప్‌స్టార్ట్స్ లో కనిపించారు.;
అదృష్టం ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఆమె పలు భాషల్లో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా మారిపోయారు. 2019లో బీర్బల్ ట్రయాలజీ సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టిన రుక్మిణి ఆ తర్వాత బాలీవుడ్ లో అప్‌స్టార్ట్స్ లో కనిపించారు. అయితే రుక్మిణి ముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం సప్త సాగరాలు దాటి సినిమానే.
సప్త సాగారాలు దాటి సినిమాతో నటిగా గుర్తింపు
ఆ సినిమాతో నటిగా ఎంతో గుర్తింపు, ఎన్నో అవార్డులను అందుకున్నారు రుక్మిణి. సప్త సాగరాలు దాటి సైడ్ ఎ తర్వాత దానికి సీక్వెల్ లో కూడా నటించి అందరినీ తన గురించి, తన నటన గురించి మాట్లాడుకునేలా చేశారు రుక్మిణి. శివరాజ్ కుమార్ కు జోడీగా భైరతి రణగ్‌లో ప్రధాన పాత్రను పోషించిన రుక్మిణి ఆ తర్వాత నిఖిల్ తో కలిసి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో నటించి ఆ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా దారుణమైన ఫ్లాపుగా నిలిచింది.
రిలీజ్ కు రెడీ అవుతున్న మదరాసి
అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఈ కన్నడ భామ కోలీవుడ్ దృష్టిలో పడ్డారు. అందులో భాగంగానే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మదరాసి సినిమాలో ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం మదరాసి సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా, ఆ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే విజయ్ సేతుపతితో కలిసి రుక్మిణి ఏస్ అనే సినిమా చేశారు. రిలీజైన టైమ్ లో ఏస్ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది.
రుక్మిణి చేతిలో రెండు భారీ సినిమాలు
కాగా ఇప్పుడు రుక్మిణి చేతిలో రెండు భారీ ప్రాజెక్టులున్నాయి. అందులో ఒకటి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాగా రెండోది కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. ఈ రెండు సినిమాల్లో రుక్మిణి హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే చర్చలు జరిగాయని, త్వరలోనే అధికారిక ప్రకటనలు రానున్నాయని తెలుస్తోంది. చూస్తుంటే ఈ రెండు సినిమాలతో రుక్మిణి సౌత్ సినిమాలో భారీ క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటూ బిజీగా మారి సౌత్ లో చక్రం తిప్పేట్టే కనిపిస్తోంది.