పాన్ ఇండియా చిత్రాలతో క్లౌడ్ బ‌ర‌స్ట్ లా!

క‌న్న‌డ బ్యూటీ రుక్మిణి వ‌సంత్ ఇప్పుడో సంచ‌ల‌నం. వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల్లో ఛాన్స్ లు అందుకుంటూ విజ‌యాల‌కంటే ముందుగానే స్టార్ లీడ్ కు అతి చేరువ‌లో క‌నిపిస్తోంది.;

Update: 2025-08-19 06:41 GMT

క‌న్న‌డ బ్యూటీ రుక్మిణి వ‌సంత్ ఇప్పుడో సంచ‌ల‌నం. వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల్లో ఛాన్స్ లు అందుకుంటూ విజ‌యాల‌కంటే ముందుగానే స్టార్ లీడ్ కు అతి చేరువ‌లో క‌నిపిస్తోంది. రిష‌బ్ శెట్టి స్వీయా ద‌ర్శ‌క త్వంలో  'కాంతారా'  చాప్ట‌ర్ వ‌న్ పాన్ ఇండియాలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే శివ కార్తికేయ‌న్ హీరోగా ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కె క్కుతోన్న 'మ‌ద‌రాసీ'లోన ఈ భామే హీరోయిన్. ఈ రెండు చిత్రాలు చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉన్నాయి.

మిగ‌తా ప‌నులు ప‌నులు పూర్తి చేసుకుని త్వ‌ర‌లోనే రిలీజ్ కానున్నాయి. మ‌రోవైపు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ `డ్రాగ‌న్` చిత్రాన్ని ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తోన్న సంగ‌తి తెలి సిందే. ఇందులోనూ రుక్మిణి వ‌సంత్ నాయిక‌గా న‌టిస్తోంది. ఎంతో మంది ఫేమ‌స్ బ్యూటీలున్నా? ప్ర‌శాంత్ ఏరికోరి మ‌రీ రుక్మిణిని ఎంపిక చేసారు. సినిమాలో బ‌ల‌మైన పాత్ర‌లోనే క‌నిపిస్తుంద‌ని ప్ర‌చారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో పాన్ ఇండియా చిత్రంలో రుక్మిణి కీల‌కంగా మారుతుంద‌ని తెలుస్తోంది.

టాక్సిక్ లో కీలక పాత్ర‌:

య‌శ్ క‌థానాయ‌కుడిగా గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో 'టాక్సిక్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ కీల‌క పాత్రకు రుక్మిణి ని తీసుకున్న‌ట్లు స‌మాచారం. హీరోయిన్ గా కియారా అద్వాణీ న‌టి స్తున్నా? అక్క పాత్ర‌లో న‌య‌న‌తార న‌టిస్తున్నా? తారా సుతారా, హ్యూమా ఖురేషీలాంటి భామ‌లు ప్రాజెక్ట్ లు భాగ‌మైనా? వాళ్ల‌తో సంబంధం లేకుండా గీతూ మోహ‌న్ దాస్ రుక్మిణికి ప్రాజెక్ట్ లో కీల‌క బాధ్య‌త‌లు అప్పగించిన‌ట్లు తెలుస్తోంది. ఇవ‌న్నీ పాన్ ఇండియా సినిమాలు కావ‌డంతో రుక్మిణి వ‌సంత్ పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

క‌న్న‌డిగిపై మ‌మ‌కారంతో:

వ‌రుస‌గా బిగ్ స్టార్స్ చిత్రాల్లో అవ‌కాశాలు అందుకోవ‌డంతో క్లౌడ్ బ‌ర‌స్ట్ లా మారింది. స్టార్ హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. బాలీవుడ్..టాలీవుడ్ ...కోలీవుడ్ లో రుక్మిణి ని మించిన ప్ర‌తిభ గ‌ల నాయిక‌లు కోకోకొల్ల‌లు. కానీ వారంద‌ర్నీ ప‌క్క‌న‌బెట్టి మ‌రీ రుక్మిణి అవ‌కాశాలు అందుకోవ‌డం విశేషం. రుక్మిణి వ‌సంత్ క‌న్న‌డిగా కావ‌డం కూడా బాగా క‌లిసొచ్చిన అంశం.  'డ్రాగ‌న్' త‌ప్ప మిగ‌తా సినిమాల‌న్నీ పాన్ ఇండియా లో రిలీజ్ అవుతోన్న క‌న్న‌డ చిత్రాలే. డ్రాగ‌న్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కూడా క‌న్న‌డిగి కావ‌డంతో? రుక్మిణి కే అవ‌కాశం ఇచ్చారు అన్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News