ఆ నెంబర్ నాది కాదు.. రియాక్ట్ అవకండి
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార చాప్టర్1 మూవీతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి రుక్మిణి వసంత్.;
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార చాప్టర్1 మూవీతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి రుక్మిణి వసంత్. రీసెంట్ గా అమ్మడు తన పేరుతో జరుగుతున్న ఓ మోసంపై ఫ్యాన్స్ ను, ప్రజలను అప్రమత్తం చేశారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి తన పేరుని వాడుకుని కొంతమందిని సంప్రదిస్తున్నాడని, అతడితో జాగ్రత్తగా ఉండాలని రుక్మిణి అందరికీ సూచించారు.
ఆ నెంబర్ కు నాకూ ఎలాంటి సంబంధం లేదు
ఈ విషయంలో రుక్మిణి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను చేశారు. ఎంతో ముఖ్యమైన హెచ్చరిక అంటూ పోస్ట్ పెట్టారు రుక్మిణి. 944***273 అనే నెంబర్ ను వాడుతున్న ఓ వ్యక్తి, తన పేరు చెప్పుకుంటూ తప్పుడు ఉద్దేశాలతో పలువురిని సంప్రదిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, తనకు, ఆ నెంబర్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆ నెంబర్ నుంచి వచ్చే కాల్స్, మెసేజెస్ ఫేక్ అని, దయచేసి ఎవరూ వాటికి రియాక్ట్ అవొద్దంటూ రుక్మిణి కోరారు.
కఠిన చర్యలు తీసుకుంటా..
ఇలాంటివి చేయడం సైబర్ నేరమని, తన టీమ్ ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తున్నట్టు రుక్మిణి తెలిపారు. ఈ విషయంలో అందరూ రుక్మిణికి సపోర్ట్ చేస్తూ ఉండగా, ఇలా ఒకరి పేరుని మరొకరు ఎలా వాడుకుంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ వస్తే, తనను లేదా తన టీమ్ ను సంప్రదించాలని ఆమె కోరారు.
ఇక సినిమాల విషయానికొస్తే రుక్మిణి వసంత్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. దీంతో పాటూ విజయ్ సేతుపతి- మణిరత్నం సినిమాతో పాటూ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ లో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు రుక్మిణి.