• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆర్‌ఆర్‌ఆర్‌' సీక్వెల్‌...

'ఆర్‌ఆర్‌ఆర్‌' సీక్వెల్‌ రాజమౌళి సినిమా కాదు...!

| విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2023-07-31 06:22 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో వచ్చి సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కు సీక్వెల్‌ వస్తుంది అంటే ప్రతి ఒక్క ఇండియన్ ప్రేక్షకుడు కూడా ఆసక్తి కనబరచడం ఖాయం.

ఆస్కార్‌ ను ఇండియాకు తీసుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కు సీక్వెల్‌ ను రూపొందించే పని లో ఉన్నామని ఆ మధ్య ఈ చిత్ర రచయిత కమ్‌ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. సినిమా సీక్వెల్‌ స్క్రిప్ట్‌ చర్చలు జరుగుతున్నాయి అంటూ ఆయన పేర్కొనడంతో మహేష్ బాబు తో సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి ఆర్ఆర్ఆర్ రీమేక్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు.

ఆర్ఆర్‌ఆర్ సినిమా సీక్వెల్‌ గురించి ప్రస్తుతం ఆసక్తికర పుకారు ఒకటి సోషల్‌ మీడియా లో షికారు చేస్తోంది. ఈ సీక్వెల్‌ కు రాజమౌళి కాకుండా విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఆయన దర్శకత్వంలో సీక్వెల్‌ ఏంటా అంటూ చాలా మంది నోరు వెళ్లబెడుతున్నారు.

ఈ ప్రచారం ఎలా ప్రారంభం అయింది.. ఎక్కడి నుంచి పుట్టుకు వచ్చిందో తెలియదు కానీ ఇది ఎంతవరకు సాధ్యమో అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌ అంటే రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ లు ఉండాల్సిందే. ఒక వేళ చంద్రశేఖర్ యేలేటి సీక్వెల్‌ కు దర్శకత్వం వహిస్తే వారిద్దరు నటించేందుకు ఓకే చెప్తారా అనేది అనుమానం.

ఆర్ఆర్ఆర్‌ సీక్వెల్ ను చరణ్‌, ఎన్టీఆర్ లేకుండా చేస్తారా అనే అనుమానాలు కూడా మొదలు అయ్యాయి. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో సినిమా కనుక హీరోల మార్పు ఉండవచ్చు. ప్రస్తుతానికి సోషల్‌ మీడియా లో ఆసక్తిగా చర్చ జరుగుతున్న ఈ సీక్వెల్‌ పై మరింత స్పష్టత ఎప్పటికి వస్తుందో చూడాలి.

Tags:    
  • RRR 
  • Rajamouli 
  • Vijayendraprasad 
  • Ntr 
  • Ramcharan 
  • Sequel 
  • Chandrasekharyeleti 
  • Tollywood 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS