రౌడీ కోసం నెవ‌ర్ ఎక్స్‌పెక్టెడ్ స్టార్ వ‌చ్చేస్తున్నారా?

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌` త‌రువాత కొంత నిరుత్సాహానికి గురైన విష‌యం తెలిసిందే.;

Update: 2025-05-14 09:20 GMT

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌` త‌రువాత కొంత నిరుత్సాహానికి గురైన విష‌యం తెలిసిందే. ఈ మూవీ డిజాస‌ర్ట్ కావ‌డంతో మన‌స్తాపానికి గురైన విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సారి వేసే అడుగు సంచ‌ల‌నం సృష్టించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌క్కా ప్లానింగ్‌లో వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్ట్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. `క‌ల్కి 2898 ఏడీ`లో అర్జునుడిగా క‌నిపించి స‌త్తా చాటుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ మూవీ త‌రువాత సోలో హీరోగా క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తున్నాడు. `జెర్సీ` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్‌లో ప్ర‌స్తుతం చేస్తున్న మూవీ `కింగ్ డ‌మ్‌`.

స్పై యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈమూవీ షూటింగ్ దాదాపుగా పూర్త‌యి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటూ శ‌ర‌వేగంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అంతా అనుకున్న‌ట్టుగా జ‌రిగితే ఈ నెల 30న విడుద‌ల కావాల్సింది. కానీ ఇండియా - పాక్ యుద్ధం కార‌ణంగా సినిమా రిలీజ్‌ని జూలైకి వాయిదా వేశారు. రౌడీ హీరో బారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా జూలై 4న రిలీజ్ చేయాలనే ఆలోచ‌న‌లో ఉన్నారు.

దీని త‌రువాత వెంట‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్‌లో ఓ భారీ సినిమా చేయ‌బోతున్నాడు. దీనికి `రౌడీ జ‌నార్థ‌న్` అనే టైటిల్‌ని ఇప్ప‌టికే దిల్ రాజు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీకి ర‌వి కిర‌ణ్ కోల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో భారీ స్థాయిలో తెర‌పైకి రానున్న ఈ సినిమా రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో రూపొంద‌నుంద‌ట‌. అయితే ఈ మూవీలోని ఓ కీల‌కమైన ప్ర‌తినాయ‌కుడి క్యారెక్ట‌ర్ కోసం క్రేజీ న‌టుడి కోసం గ‌త కొన్ని రోజులుగా అన్వేషిస్తున్న టీమ్ ఫైన‌ల్‌గా ఆ న‌టుడిని పట్టేసే ప‌నిలో ఉన్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆ క్రేజీ న‌టుడు మ‌రెవ‌రో కాదు పోలీస్ స్టోరీస్‌తో యాంగ్రీయంగ్ మెన్‌గా పేరు తెచ్చుకున్న డా. రాజ‌శేఖ‌ర్‌. త‌న‌తో మెయిన్ విల‌న్ క్యారెక్ట‌ర్ చేయించాల‌ని దిల్ రాజు ప్ర‌యత్నాలు చేస్తున్నార‌ట‌. ఇటీవ‌లే రాజ‌శేఖ‌ర్‌పై ఈ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన ఫోటోషూట్ కూడా జ‌రిగిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమా రాజ‌శేఖ‌ర్ క్యారెక్ట‌ర్, గెట‌ప్ నెక్స్ట్‌లెవెల్‌లో ద‌ర్శ‌కుడు ర‌వికిర‌ణ్ కోలా డిజైన్ చేసిన‌ట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే దిల్ రాజు టీమ్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

Tags:    

Similar News