'పానీయం' సేవించ‌మంటే త‌ప్పా? న‌టి ఆవేద‌న‌!

చాలామంది త‌ల్లులు పీరియ‌డ్ స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించ‌రు. కానీ రోష్ని త‌ల్లి త‌న‌తో అన్ని విష‌యాల‌ను చ‌ర్చిస్తుంద‌ని తెలిపారు.;

Update: 2025-07-27 06:55 GMT

ఒక త‌ల్లి త‌న కుమార్తెను స్వేచ్ఛ‌గా జీవించాల‌ని కోరుకోవ‌డం, జీవితాన్ని ఆస్వాధించాల‌ని చెప్ప‌డం త‌ప్పు ఎలా అవుతుంది? స్వేచ్ఛ‌గా జీవించాల‌ని చెబుతూనే, హ‌ద్దుల గురించి వివ‌రించ‌డం త‌ల్లి బాధ్య‌త. అయినా ఇది పూర్తిగా వారి వ్య‌క్తిగ‌త ఎంపిక‌. కానీ ట్రోల‌ర్స్ నుంచి తీవ్రంగా ట్రోలింగ్ ని ఎదుర్కొంటోంది యువ‌న‌టి రోష్ని వాలియా.

హిందీ న‌టి, `సన్ ఆఫ్ సర్దార్ 2` ఫేం రోష్ని వాలియా ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో త‌న త‌ల్లిదండ్రుల బ్రేక‌ప్ త‌ర్వాత త‌న త‌ల్లి త‌న‌ను ఎలా పెంచి పోషించింది? అనే విష‌యాల‌ను వెల్లడించారు. అమ్మ బ‌ల‌మైన వ్య‌క్తిత్వంతో ప‌రిణ‌తితో త‌న‌ను తాను తీర్చిదిద్దుకుని, స్వేచ్ఛ, జీవితాన్ని ఆస్వాధించాల్సిన‌ అవ‌స‌రాన్ని కూడా త‌న‌కు వివ‌రించింద‌ని రోష్ని వెల్ల‌డించారు. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు కుమార్తెగా ఎలా ఉండాలో కూడా త‌న‌కు నేర్పింద‌ని వెల్లడించింది.

చాలామంది త‌ల్లులు పీరియ‌డ్ స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించ‌రు. కానీ రోష్ని త‌ల్లి త‌న‌తో అన్ని విష‌యాల‌ను చ‌ర్చిస్తుంద‌ని తెలిపారు. పార్టీల‌కు వెళ్లాలి.. పానీయం ఆస్వాధించాలి! అని త‌న‌తో స్వేచ్ఛాయుత జీవితాన్ని ఎలా ఆస్వాధించాలో చెబుతుంద‌ని వ్యాఖ్యానించారు. జీవితాన్ని పూర్తిగా జీవించమని ప్రోత్సహిస్తుంది అమ్మ‌.. కానీ బాధ్యతాయుతంగా జీవించాల‌ని సూచిస్తుంది. అయితే ఈ వ్యాఖ్య‌లు నెటిజ‌నుల‌కు ఎంత‌మాత్రం రుచించ‌లేదు. చాలామంది రోష్ని కుటుంబ విలువ‌ల్ని ప్ర‌శ్నిస్తూ దూషించేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే ఇలా కుటుంబ పాల‌సీల్లో ఇత‌రులు త‌లదూర్చ‌డం స‌రికాదనే వాద‌న కూడా వినిపిస్తోంది. ఎవ‌రి వ్య‌క్తిగ‌త జీవితం వారిది. ఒక‌రిని బ‌ల‌వంతంగా ఏదీ చేయ‌మ‌ని ఎవ‌రూ చెప్ప‌డం లేదు. కాక‌పోతే ప‌బ్లిక్ వేదిక‌పై నిజాయితీగా మాట్లాడితే ఎదుర‌య్యే చిక్కుల్ని కూడా గుర్తుంచుకుని ఏదైనా వ్యాఖ్యానించాలి. అజ‌య్ దేవ‌గ‌న్, మృణాల్ ఠాకూర్ ల‌తో క‌లిసి రోష్ని స‌న్ ఆఫ్ స‌ర్ధార్ 2లో న‌టించింది. ఈ సినిమా ఇటీవ‌లే విడుద‌లైంది.

Tags:    

Similar News