రోషన్ ధైర్యానికి ఫలితం?

సాధారణంగా సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా బాడీ షేమింగ్, రంగు వివక్షత లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.;

Update: 2026-01-05 23:30 GMT

సాధారణంగా సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా బాడీ షేమింగ్, రంగు వివక్షత లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా వారిని ఇలాంటి ట్రోల్స్ కారణంగా ట్రెండింగ్ లోకి తీసుకొస్తూ ఉంటారు.. ముఖ్యంగా కొంతమంది ఆకతాయిలు సెలబ్రిటీలే టార్గెట్ గా పెట్టుకొని, వారిని టార్గెట్ గా చేసుకొని వారి లుక్స్ గురించి, బాడీ గురించి మాట్లాడుతూ వారికి ఇబ్బందులు కలిగిస్తున్న విషయం తెలిసిందే.ఇలా అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళను మొదలుకొని సీనియర్ స్టార్ హీరోలు హీరోయిన్ల వరకు ఎంతోమంది ఇలా ట్రోల్స్ ఎదుర్కొంటున్నవారే. అలా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న వారిలో తానేమి అతీతం కాదు అని చెబుతున్నారు రోషన్ కనకాల.

ప్రముఖ యంగ్ హీరో రోషన్ కనకాల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బుల్లితెర మహారాణిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ప్రముఖ యాంకర్ కం నటి సుమా కనకాల, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల దంపతుల కుమారుడే రోషన్ కనకాల. తల్లిదండ్రుల బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకొని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రోషన్ కనకాల. బబుల్ గమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన మొదటి సినిమా విడుదలైనప్పుడు ఎంతోమంది ట్రోల్స్ చేశారు.అయితే వాటన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం తనకు తల్లి ఇచ్చిందని, ఆమె వల్లే ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. అంతేకాదు సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై స్పందించి అందరిని ఆశ్చర్యపరిచారు రోషన్.

అసలు విషయంలోకి వెళ్తే తాజాగా రోషన్ నటించిన చిత్రం మోగ్లీ 2025. గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పర్వాలేదు అనిపించుకుంది. ఈ సమయంలో కూడా రోషన్ ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోషన్ కనకాల.. తన మొదటి సినిమా బబుల్ గమ్ తర్వాత తాను ఎదుర్కొన్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. "నా మొదటి సినిమా విడుదలయ్యాక నా నటన గురించి కాకుండా నా రంగు గురించి మాట్లాడారు. ఇప్పుడు మోగ్లీ 2025 మూవీ విడుదలయ్యాక రంగు గురించి కాకుండా మరోలా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బాడీ గురించి కూడా కామెంట్లు చేసి బాడీ షేమింగ్ చేశారు. ఇవన్నీ బట్టి చూస్తే కొంతమంది ట్రోల్స్ చేయడమే పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పగానే.. మా అమ్మ ఒకటే మాట అడిగింది. సోషల్ మీడియాని నువ్వు తట్టుకుంటావా? అని, అన్నిటిని ఎదుర్కోగలను అని చెప్పి ధైర్యంగా ఇండస్ట్రీలోకి వచ్చాను. అందుకే సంబంధం లేకుండా మాట్లాడే వాళ్లను పట్టించుకోకూడదు అని నిర్ణయించుకున్నాను" అంటూ సోషల్ మీడియా ట్రోల్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు రోషన్.

మొత్తానికైతే ఈ బాడీ షేమింగ్ కామెంట్స్ , రంగు వివక్షత లాంటి ట్రోల్స్ హీరోయిన్లకే కాదు హీరోలకి కూడా తప్పలేదు అని మరొకసారి నిరూపించారు రోషన్ కనకాల. "ఇలాగే పుట్టాను ఇలాగే ఉంటాను" అంటూ "మనిషిని నిర్ణయించేది రంగు కాదని , ప్రతిభ మాత్రమేనని".. ట్రోల్స్ ఎదుర్కోవడంలో తన తల్లి తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది అని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే ధైర్యంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నువ్వు ఒక్కో మెట్టు ఎదుగుతూ కచ్చితంగా సక్సెస్ అందుకుంటావు అంటూ అభిమానులు కూడా రోషన్ కి భరోసా ఇస్తున్నారు.

Tags:    

Similar News