అర్జున్ రెడ్డి, యానిమల్ తర్వాత.. వంగా పిక్చర్స్ 'రోమాంచకం'

సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న ఈ సినిమాను వంగా ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Update: 2026-07-29 05:37 GMT

ఒక సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందంటే ఇండస్ట్రీలో దానిపై ఆసక్తి ఉండటం సహజం. ఇప్పుడు నిర్మాణ సంస్థ వంగా పిక్చర్స్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ నిర్వాణ సినిమాస్ కాంబినేషన్ లో సరిగ్గా ఇలాంటి బజ్ కనిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే తరహాలో కంటిన్యూ చేస్తూ రోమాంచకం అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ రోమాంచకం చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఓవర్సీస్ రిలీజ్ బాధ్యతలను నిర్వాణ సినిమాస్ తీసుకుంది. ఇక అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 2నే పడబోతున్నాయి. గత చిత్రాల ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న ఈ సినిమాను వంగా ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ ప్రభాస్, అనంతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ఒక క్యూట్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ తో కలిసి వంగా పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ను చాలా సైలెంట్ గా పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేసింది.

ఇక రిలీజ్ చేసిన పోస్టర్ లో సినిమా థీమ్ ను చాలా క్లియర్ గా చెప్పారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రాబోతోంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో హైదరాబాద్ సిటీకి సంబంధించిన బస్సులు, ఆటోలు, ముఖ్యమైన ఐకానిక్ ప్లేసెస్ తో ఒక హార్ట్ సింబల్ ను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. దీన్ని బట్టి ఇదొక సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ సస్పెన్స్ డ్రామా అని అర్థం చేసుకోవచ్చు.

ఈ ప్రాజెక్ట్ కు వాసుకి వైభవ్ సంగీతం అందిస్తుండగా, పవన్ పాపుల సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. పోస్టర్ లో నెట్ ఫ్లిక్స్ లోగో కూడా కనిపించడంతో, థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందని క్లారిటీ వచ్చేసింది. టి సిరీస్ సౌత్ ద్వారా ఈ సినిమా మ్యూజిక్ బయటకు రాబోతోంది. టెక్నికల్ గా చూసుకుంటే సినిమాకు ఒక డీసెంట్ టీమ్ కుదిరినట్లే కనిపిస్తోంది.

కంటెంట్ క్లిక్ అయితే చిన్న సినిమాలకు కూడా ఓవర్సీస్ లో మంచి ఆదరణ దక్కుతున్న రోజులివి. దానికి తోడు వంగా లాంటి బ్రాండ్ నేమ్, నిర్వాణ సినిమాస్ లాంటి డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ తోడవడంతో రోమాంచకంకి రిలీజ్ పరంగా ఒక మంచి ఫ్లాట్ ఫామ్ దొరికింది. అయితే బాక్సాఫీస్ దగ్గర నిలబడాలంటే మాత్రం పోస్టర్ మీద చెప్పిన ఆ ఉత్కంఠ, ప్రేమ ఏ స్థాయిలో వర్కౌట్ అయ్యాయి అనేది సెప్టెంబర్ 3న స్క్రీన్ మీదే తేలనుంది.

Tags:    

Similar News