జయం రవిపై కొత్త ఆరోపణలు.. నిజమేనా?

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ అందుకున్న రవి మోహన్ అలియాస్ జయం రవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Update: 2026-06-24 08:07 GMT

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ అందుకున్న రవి మోహన్ అలియాస్ జయం రవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తమిళంలోనే కాదు ఇటు తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. గత కొంతకాలంగా వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా సింగర్ కెనీషాతో చట్టపట్టలేసుకొని తిరగడం అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి తోడు ఈయన భార్య ఆర్తి విడాకుల కేసు ఇండస్ట్రీలో కలకలం రేపింది. అలా ఒకవైపు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే.. ఇప్పుడు మరొకవైపు ఇంట్లో పని మనుషులను నిర్బంధించినట్లు ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయంలోకి వెళ్తే.. జయం రవి ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.ఆయన నివాసంలో ఇద్దరు మహిళలు, ఒక మైనర్ బాలుడు పని మనుషులుగా పనిచేస్తూ అక్కడే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారట. ఇటీవల కాలంలో జయం రవి ఇంట్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయట. అయితే ఈ విషయాన్ని జయం రవి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. తన ఇంట్లో పనిచేస్తున్న పని మనుషులపై అనుమానం రావడంతో వారిని నిర్బంధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ ఇద్దరు మహిళల్లోని ఒక మహిళ భర్త తన భార్య ఇంటికి రాకపోయేసరికి అనుమానించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారట. తమ భార్యను, మరో మహిళ, మైనర్ బాలుడిని జయం రవిని నిర్బంధించి ఇబ్బందులు పెడుతున్నారు అంటూ ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఆ ఇద్దరు మహిళలను, మైనర్ బాలుడిని విడిపించి జయం రవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదని, ఏదైనా అనుమానం వచ్చినా లేదా చోరీ జరిగిందని తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సెలబ్రిటీల పేరుతో మీరు చేసే పనులు ఇతరులకు తప్పుడు సందేశాన్ని అందిస్తాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం జయం రవి పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది.

ఇక జయం రవి వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ సినీ నటి ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జయం రవికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక సవ్యంగా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చిన జయం రవికి సడన్గా ఆయన భార్య ఆర్తి షాక్ ఇస్తూ విడాకులు కోరింది. రవి కూడా తనను తన భార్య మానసికంగా ఇబ్బందులకు గురిచేసిందని, తనను మోసం చేసిందని, ఆర్థికంగా ఇబ్బంది పెట్టిందంటూ కేసు పెట్టారు. దీనికి తోడు ప్రముఖ సింగర్ కెనీషా తో ఆయన చట్టపట్టలేసుకొని తిరగడం , పైగా ఇద్దరూ కలిసి ప్రాపర్టీ కొనుగోలు చేయడం, అందులో జయం రవి సింగిల్ అని మెన్షన్ చేయడం అన్నీ హాట్ టాపిక్ గా మారాయి. మరి ఇన్ని విమర్శలు, ఆరోపణల వస్తున్న వేళ జయం రవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News