కాబోయే భర్త మోసం తట్టుకోలేక ఆస్పత్రి పాలయ్యాను: RJ మహ్వాష్
భార్య నుంచి విడిపోయాక టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ఆర్జే మహ్వాష్ కి సన్నిహితంగా పలుమర్లు కనిపించారు.;
భార్య నుంచి విడిపోయాక టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ఆర్జే మహ్వాష్ కి సన్నిహితంగా పలుమర్లు కనిపించారు. దీంతో ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందన్న ప్రచారం సాగింది. కానీ దానిని ఇద్దరూ వేర్వేరు ప్రకటనల్లో ఆ ఇద్దరూ ఖండించారు. అయితే చాహల్ తో లింకప్ వార్తలు వచ్చే క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఓ ఘటన గురించి మాట్లాడుతూ.. తనకు ఇప్పట్లో పెళ్లిపై ఆసక్తి లేదని మహ్వాష్ పేర్కొంది. ఇలాంటి కఠోర నిర్ణయం వెనక అసలు కారణాన్ని కూడా చెప్పి అందరికీ షాకిచ్చింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహ్వాష్ తనకు కాబోయే భర్త మూడుసార్లు మోసం చేశాడని, ఆ బాధను తట్టుకోవడానికి వైద్య చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. బ్రేకప్- విడాకుల విషయంలో సమాజం మహిళలను ఎలా నిందిస్తుందో చెబుతూ విచారం వ్యక్తం చేసింది. అయితే విడిపోవడం వల్ల కలిగే భావోద్వేగాన్ని, బాధను తాను పట్టించుకోలేదని అంది.
ఒక సంబంధం వర్కవుట్ కానప్పుడు అపరాధ భావన, స్వీయ నిందలు మనపై ఎదురు దాడి చేస్తాయి. చెడు ఏమిటంటే బ్రేకప్ సమయంలో అది మీ ఆత్మవిశ్వాసాన్ని శాశ్వతంగా మీనుంచి తీసివేస్తుందనేది మీరు గ్రహించలేరు. మిమ్మల్ని మీరు అనుమానించడం ప్రారంభిస్తారు. బహుశా నేను అతడికి సరిపోకపోవచ్చు.. బహుశా అతడి కొత్త స్నేహితురాలు నాకంటే అందగత్తె, మంచిది కావచ్చు. దాని కారణంగా మీరు వెయ్యి సార్లు అద్దం ముందు నిలబడి, మీ రూపాన్ని ప్రశ్నిస్తారు. విడిపోయిన తర్వాత మీరు ఏమి కోల్పోయారో చూడండి. అది ఒక దశ. ఆ తర్వాత మీరు అకస్మాత్తుగా మంచి ఫోటోలను పోస్ట్ చేయడం ప్రారంభిస్తారు. ఇది కేవలం అంతర్గత యుద్ధం గురించిన మ్యాటర్ అని మహ్వాష్ తెలిపారు. అపనమ్మకం గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తి మోసం చేయాలనుకుంటే, పరిస్థితులతో సంబంధం లేకుండా వారు మోసగిస్తారని బలంగా చెప్పారు. `` నా ఫియాన్సీ నన్ను మూడు సార్లు మోసం చేసాడు. యు ఆర్ ఏ గుడ్ కిస్సర్`` అని వేరొక అమ్మాయికి అతడు పంపిన మెసేజ్ నేను చూసాను. నేను అంత మంచి కిస్సర్ ని కాదని అనుకున్నాను అని మహ్వాష్ తెలిపారు.