ఆ హిట్ తో 100 కోట్ల ప్రాజెక్ట్ లో ఛాన్స్!

`హ‌లో` తో ఎంట్రీ ఇచ్చిన క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జ‌ర్నీ టాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.;

Update: 2025-12-05 18:30 GMT

`హ‌లో` తో ఎంట్రీ ఇచ్చిన క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జ‌ర్నీ టాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సినిమా ఫ‌లితంతో వెంట వెంట‌నే వ‌రుస‌గా తెలుగు అవ‌కాశాలు అందుకుంది. `చిత్ర‌ల‌హ‌రి`, `ర‌ణ‌రంగం` లాంటి చిత్రాల్లో మెరిసినా? అటుపై అమ్మ‌డు మాత్రం టాలీవుడ్ లో బిజీ కాలేక‌పోయింది. దీంతో `హీరో` సినిమాతో కోలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డా సొగ‌స‌రి కెరీర్ పుంజుకోలేదు. రెండు..మూడు చిత్రాల‌తోనే అక్క‌డా వ‌డి వ‌డిగాన అడుగులు వేసింది. అనంత‌రం మాలీవుడ్ లో మాత్రం బిజీ అయింది. రెండు..మూడేళ్ల‌గా అవ‌కాశాలు బాగానే అందుకుంటుంది.

కార్తీ సినిమాకు క‌లిసొచ్చే బ్యూటీ:

ఇటీవ‌ల విడుద‌లైన `లోక చాప్ట‌ర్ వ‌న్ చంద్ర‌`తో భారీ విజ‌యం అందుకుంది. క‌ల్యాణీ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిందా చిత్రం. బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 300 కోట్ల వ‌సూళ్లు సాధించ‌డంతో? సౌత్ లో బాగా ఫేమ‌స్ అయింది. ఫీమేల్ సెంట్రిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో క‌ల్యాణీ పేరు మారు మ్రోగింది. ఇప్పుడిదే క్రేజ్ తో అమ్మ‌డు మ‌ళ్లీ కోలీవుడ్ లో బిజీ అవుతుంది. ఇప్ప‌టికే `జెన్నీ` చిత్రంలో న‌టిస్తోంది. తాజాగా కార్తీ హీరోగా న‌టిస్తోన్న `మార్ష‌ల్` లోనూ ఛాన్స్ అందుకుంది. సినిమా ఆన్ సెట్స్ లో ఉన్నా ఇంత కాలం హీరోయిన్ ఎంపిక పూర్తి చేయ‌లేదు.

ఇదొక డిఫ‌రెంట్ జాన‌ర్:

ప‌లువురు భామ‌ల్ని ప‌రిశీలించినా? వారంద‌ర్నీ ప‌క్కన బెట్టి క‌ల్యాణీని తీసుకున్నారు. ఆల‌స్య‌పు ఎంపిక కూడా మేక‌ర్స్ కి క‌లిసొచ్చింద‌ని చెప్పొచ్చు. మార్కెట్ ప‌రంగా క‌లిసొస్తుంది. ఆసంగ‌తి ప‌క్క‌న బెడితే కార్తీ హీరోగా తెర‌కెక్కుతోన్న 29వ చిత్ర‌మిది. త‌మిళ అనే డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. డ్రీమ్ వారియ‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఇదొక డిఫ‌రెంట్ జాన‌ర్ చిత్రం. కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందిస్తున్నారు. సీ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ చిత్ర‌మిది. ఇప్ప‌టి వ‌ర‌కూ కార్తీ ఈ జాన‌ర్లో సినిమాలు చేయ‌లేదు.

బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ ల‌తో:

ఇదే తొలి చిత్రం కావ‌డంతో ఎంతో ఎగ్జైట్ మెంట్ తో పాల్గొంటున్నాడు. పాత్ర కోసం అవ‌స‌రం మేర కార్తీ కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్న‌ట్లు స‌మాచారం. డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రెండు భాగాలుగా చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్నట్లు వార్త‌లొస్తున్నాయి. మొద‌టి భాగాన్ని వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం కార్తీ హీరోగా న‌టించిన `వా వాత‌యార్` డిసెంబ‌ర్ లోనే రిలీజ్ అవుతుంది. అనంత‌రం వ‌చ్చే ఏడాది ఆరంభంలో `స‌ర్దార్ 2` కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags:    

Similar News