కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన అలియా దంపతులు.. ఫోటోలు వైరల్

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినీ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ..;

Update: 2025-12-05 17:30 GMT

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినీ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది. అందంతోపాటు నటనతో యాక్షన్ పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. హాలీవుడ్ రేంజ్ తరహా నటనతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న ఈమె.. అతి తక్కువ సమయంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా రికార్డ్ సృష్టించింది.



 


బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ నేచురల్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న అలియా భట్ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ద్వారా సీత పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. చేసింది తెలుగులో మొదటి సినిమానే అయినా తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ ఇకపోతే ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇక వివాహం అనంతరం అదే ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు రాహా అని నామకరణం కూడా చేసిన విషయం తెలిసిందే.



 


ఇకపోతే రాహా జన్మించిన తర్వాత తమ సంపాదనలో ఇద్దరు సగభాగం కూతురు పేరిట జమ చేస్తున్నట్లు ఆలియా తన అభిప్రాయంగా చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. అంతేకాదు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రా వెస్ట్ లో కొత్త భవనాన్ని నిర్మించారు. 6 అంతస్తుల విలాసవంతమైన ఈ భవనాన్ని తమ కూతురు కోసం అత్యంత సుందరంగా నిర్మించారు. 250 కోట్ల విలువ చేసి ఈ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహాకు చెందిన ఈ ఇంట్లో పూజలు జరిపించినట్లు ఈ విషయాన్ని అలియా భట్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫోటోలను పంచుకుంది. మరొకవైపు నవంబర్ 6వ తేదీన తన కూతురు మూడవ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. కూతురుకి ఆ కొత్త ఇంట్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలను జరిపారు.



 

అలాగే తన అత్త నీతూ కపూర్ తో కలిసి దిగిన అందమైన ఫోటోని ఆమె పెంచుకున్నారు. అలాగే ఆమె సోదరీ షాహీన్ భట్ పుట్టినరోజు నుండి ఒక ఫోటోని పంచుకోగా.. రణబీర్ కపూర్ కూడా రిషి జీ ఫోటో ముందు నిల్చున్నట్లు కొన్ని ఫోటోలను పంచుకుంది. అలాగే తమ కొత్త ఇంట్లో తన తల్లి సోనీ రజ్దాన్ తో కలసి ఒక ఫోటోని షేర్ చేయగా.. ఆ ఫోటోని ఆమె తండ్రి మహేష్ భట్ తీసినట్లు తెలుస్తోంది.



 


ఆలియా భట్ సినిమాల విషయానికి వస్తే.. కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్ నటించిన రోడ్ డ్రామా జీ లే జరా తిరిగి ప్రారంభం కానుందని సమాచారం. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు వెలువడగా ఇప్పుడు తిరిగి ప్రారంభం కాబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

Tags:    

Similar News