• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరోతో లిప్ కిస్సులో...

ఆ హీరోతో లిప్ కిస్సులో రీతూ వ‌ర్మ‌!

| తెలుగు అమ్మాయి రీతు వ‌ర్మ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమ్మ‌డు ఇప్ప‌టికే తెలుగు, త‌మిళ్ లో చాలా సినిమాలు చేసింది.

By - Tupaki Desk
Update: 2025-02-18 06:09 GMT

తెలుగు అమ్మాయి రీతు వ‌ర్మ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమ్మ‌డు ఇప్ప‌టికే తెలుగు, త‌మిళ్ లో చాలా సినిమాలు చేసింది. `ప్రేమ ఇష్క్ కాద‌ల్` తో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు చాలా తెలుగు సినిమాలు చేసింది. అటుపై కోలీవుడ్ లోనూ చాలా సినిమాల్లో న‌టించింది. అయితే వెండి తెర‌పై ఎప్పుడూ హ‌ద్దులు మీరింది లేదు. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగానే ఉంది. లిప్ కిస్సులు..ఇంటిమేట్ సీన్లు అంటే ఏ సినిమా విష‌యంలోనూ ఛాన్స్ తీసుకోలేదు.

అలాంటి ఆఫ‌ర్లు చాలా వ‌చ్చినా? వ‌ద్ద‌నుకుని త‌న ఫ‌రిది మేర సినిమాలు చేసుకుంటూ వ‌చ్చింది. ఏనాడు గ్లామ‌ర్ గేట్లు ఎత్తింది లేదు. అయితే తాజాగా రీతూ వ‌ర్మ కూడా స‌రిహ‌ద్దులు దాటేసింద‌ని ఓ వార్త వెలుగులోకి వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో `మ‌జాకా`లో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇందులో హీరోగా సందీప్ కిష‌న్ న‌టిస్తున్నాడు. త్రినాధ‌రావు సినిమాలంటే ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలు.

అవ‌స‌రం మేర మ‌సాలా స‌న్నివేశాల‌కు ఛాన్స్ తీసుకుంటాడు. ఈ నేప‌థ్యంలో మ‌జాకాలో రీతూవ‌ర్మ హీరో సందీప్ కిష‌న్ తో ఓ లిప్ కిస్ స‌న్నివేశంలో న‌టించింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓ సీన్ డిమాండ్ మేర‌కు న‌క్కిన త‌ప్ప‌దు న‌టించాల్సిందేనని ప‌ట్టుబ‌ట్ట‌డంతో రీతూ వ‌ర్మ ఛాన్స్ తీసుకుంద‌ని అంటున్నారు. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తేలాలి. రీతూ వ‌ర్మ‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా? న‌టించ‌లేదు.

ఈ క్ర‌మంలో చాలా అవ‌కాశాలు కోల్పోయింది. అటు కోలీవుడ్ లో కూడా అవ‌కాశాలు త‌గ్గ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని చాలా కాలంగా అక్క‌డ మీడియాలో క‌థ‌నాలొస్తూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం రీతూ వ‌ర్మ చేతిలో ఉన్న‌ది కూడా `మ‌జాకా` చిత్ర‌మే. కోలీవుడ్ లో `ధృవ న‌క్ష‌త్రం` సినిమా చేసింది గానీ ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు. చాలా కాలాంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో `మాజాకా` చిత్రంతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని చూస్తుంది. ఈ క్రమంలోనే లిప్ కిస్సు కి ఒకే చెప్పింద‌నే వార్త‌లొస్తున్నాయి.

Tags:    
  • Rituvarma 
  • Sundeepkishan 
  • Mazakamovie 
  • Tollywood 
  • Filmindustry 
  • Trinadharaonakkina 
  • Intimatescenes 
  • Actressrituvarma 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS