• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విక్ర‌మ్ నా దేవుడు...24...

విక్ర‌మ్ నా దేవుడు...24 ఏళ్ల నా క‌ల ఇది!

| చియాన్ విక్ర‌మ్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానిస్తున్న స్టార్ అత‌ను

By - Tupaki Desk
Update: 2024-08-07 13:30 GMT

చియాన్ విక్ర‌మ్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానిస్తున్న స్టార్ అత‌ను. న‌టుడిగా ఎంతో మంది ఆరాధిస్తారు. విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తోనే విక్ర‌మ్ ఇదంతా సాధించ‌గ‌లిగారు. అలాంటి విక్ర‌మ్ నా దేవుడు అంటూ క‌న్న‌డ న‌టుడు రిష‌బ్ శెట్టి ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టాడు. ` నా సినిమా ప్ర‌యాణాకి కారకుడు విక్ర‌మ్. ఆయ‌న స్పూర్తితోనే సినిమాల్లోకి వ‌చ్చాను. ఆయ‌న్ని క‌ల‌వ‌డం నాకు 24 ఏళ్ల నుంచి ఉన్న క‌ల‌.

అది ఈరోజు తీరింది. నా దేవుడిని క‌లిసాను. ప్ర‌స్తుతం ఈ భూమ్మీద నా అంత అదృష్ట‌వంతుడు ఎవ‌రూ ఉండ‌రేమో అనిపిస్తుంది. ఆయ‌న నాలాంటి ఎంతో మంది ఆర్టిస్టుల్లో స్పూర్తిని నింపుతున్నారు. అందుకు నేను ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌తలు చెబుతున్నా. ల‌వ్ యూ విక్ర‌మ్ స‌ర్` అని రాసుకొచ్చారు. విక్ర‌మ్ తో దిగిన ఓ సెల్పీనీ కూడా పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఒకే ప్రేమ్లో బెస్ట్ యాక్ట‌ర్స్ అంటూ ఓ నెటి జ‌నుడు పోస్ట్ పెట్టాడు.

ఇక రిష‌బ్ శెట్టి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కాంతార‌తో త‌న‌ని తానే పాన్ ఇండియా స్టార్ గా లాంచ్ చేసుకున్నాడు. కాంతారని తానే స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా 400 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగులోనూ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. `భూత కోలా` అనే దైవ కాన్సెప్ట్ ఆధారంగా దీన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం ఈ సినిమాకి పీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అంతా బెంగుళూరు ఔట‌ర్ లో భారీ ఎత్తున సెట్లు నిర్మించి చేస్తున్నారు. షూటింగ్ మేజార్టీ భాగ‌మంతా సెట్స్ లోనే ఉంటుంది. అవ‌స‌ర‌మైన కీల‌క స‌న్నివేశాల కోసం కర్ణాట‌క అడ‌వుల్ని వినియోగించుకుంటున్నారు.

In my journey in becoming an actor, #Vikram Sir has always been my inspiration. After 24 long years of waiting, meeting my idol today makes me feel like the luckiest person on Earth. Thank you for inspiring actors like me, and wishing you all the best for #Thangalaan. Love… pic.twitter.com/CrmwnW4CEM

— Rishab Shetty (@shetty_rishab) August 6, 2024
Tags:    
  • Rishabshetty 
  • Chiyaanvikram 
  • Filmindustry 
  • Kantara 
  • Hombalefilms 
  • Vikram 
  • Rishabmeetsvikram 

Similar News

లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకోవడం టాలీవుడ్‌లో ఒక శాపమా..?

2026-11-07 02:43 GMT

స్టార్ హీరో షూటింగ్ కోసం క్రికెట్ మ్యాచ్‌లు ఆపేసార‌ట‌..అదెట్టా?

2026-11-07 02:42 GMT

చిరు, నాగ్ స్టెప్పులు.. నాగచైతన్య లైఫ్ పై సీరియస్.. MegaVerse లో ఏం జరిగిందంటే..!

2026-11-07 02:41 GMT

లిప్ సింకుకి త‌గ్గ‌ట్టు డ‌బ్బింగ్ మాట‌లు రాయ‌డం ఎలా?

2026-11-07 02:30 GMT

రణ్‌బీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న ఆలియా భట్ నాన్న.. ఎందుకంటే?

2026-11-07 02:11 GMT

ఐశ్వర్యారాయ్,‌ అభిషేక్ బచ్చన్ విడాకులు.. గట్టిగా క్లారిటీ ఇచ్చేసిన జంట..!

2026-11-07 02:10 GMT

నేటి కుర్ర హీరోల్లో ఆత్మవిశ్వాసం లేదు.. వాళ్లే చివరి సూపర్‌స్టార్లు!

2026-11-07 01:30 GMT

ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు కొత్త చిక్కు.. స్క్రిప్ట్ దశలోనే చట్టం తెలియ‌క‌పోతే!

2026-11-07 00:30 GMT

యుద్ధం మార్చిన బాల్యం: బాలిక జీవితం ఆధారంగా డాక్యుమెంటరీ

2026-11-06 23:30 GMT

2000-2026 మధ్య తెలుగులో టాప్ 5 విలన్ క్యారెక్టర్స్ ఇవే...

2026-11-06 22:30 GMT

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS