అభిమాన హీరో కోసం లారీ ఎక్కి మరీ... సీఎం ఫ్లాష్ బ్యాక్
అయితే వారిది అసలైన అభిమానం, దురభిమానం అనంది కానే కాదు, అలా ఒక ఆరోగ్యవంతమైన వాతావరణంలో క్రిష్ణ అభిమానులు ముందుకు సాగారు.;
సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని గర్వాన్ని తెచ్చిన దిగ్గజ నటుడు. తెలుసు సినిమాని టెక్నికల్ గా కొత్త పుంతలు తొక్కించారు. తొలి సినిమా స్కోప్, తొలి సెవెంటీ ఎంఎం ఇలా ఎన్నో రకాలుగా తెలుగు చిత్ర సీఎమను ముందు పెట్టారు. తొలి కౌబాయ్ మూవీగా మోసగాళ్లకు మోసగాడు ఇప్పటికి ఐదున్నర దశాబ్దాల క్రితమే హాలీవుడ్ రేంజిలో తీసారు. కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. ఆయన తెలుగు సినిమాను బతికించారు. అంతే కాదు థియేటర్లను డిస్ట్రిబ్యూటర్లను సినీ నటులను కూడా తన సినిమాల ద్వారా బతికించారు. ఆయన ఏడాదికి 18 దాకా సినిమాలు చేయడం వల్ల ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరికేది.
ఎందరో అభిమానులు :
క్రిష్ణకు ఎందరో అభిమానులు ఉండేవారు. వారంతా తమ హీరో కోసం ఎంతైనా అన్నట్లుగా ఉండేవారు. అయితే వారిది అసలైన అభిమానం, దురభిమానం అనంది కానే కాదు, అలా ఒక ఆరోగ్యవంతమైన వాతావరణంలో క్రిష్ణ అభిమానులు ముందుకు సాగారు. క్రిష్ణ సైతం ఏ హీరో చేయని విధంగా టాలీవుడ్ లో 350 దాకా సినిమాలు చేశారు. 20 దాకా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్నో సినిమాలు స్వయంగా నిర్మించారు. ఇలా క్రిష్ణ రికార్డులు చెక్కు చెదరనివిగా ఉంటూ వచ్చాయి.
మా హీరో అంటూ :
సూపర్ స్టార్ క్రిష్ణ అభిమానిని తాను అని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చెప్పుకున్నారు. ఆయన తాజాగా అల్లు సినిమాస్ ఓపెనింగ్ లో మాట్లాడుతూ క్రిష్ణ గురించి మంచి మాటలు చెప్పారు. రికార్డులు క్రియేట్ చేసిన వారు క్రిష్ణ అన్నారు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని సేవ చేశారు అని కొనియాడారు. తాను క్రిష్ణ అభిమానిగా తొలి రోజు ఆయన సినిమా చూడడం కోసం ఎంతో ఆతృత పడేవాడిని అన్నారు. వనపర్తిలో తాను చదువుకునే రోజులలో క్రిష్ణ సినిమా చూడాలీ అంటే ఎంతో వ్యయ ప్యయాసలకు ఓర్చేవాడిని అని గతాన్ని గుర్తు చేసుకున్నారు.
ఫ్లాష్ బ్యాక్ లో అలా :
క్రిష్ణ సినిమాలు తమ వూళ్ళొ రిలీజ్ అయ్యేవి కావని అందువల్ల అయితే కర్నూల్ లేదా హైదరాబాద్ వెళ్ళి చూసేవారమని అన్నారు. అలా జాతీయ రహదారికి వచ్చి లారీలు పట్టుకుని సినిమాలు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అదొక మంచి అనుభవం అని రేవంత్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్ రోజులను తలచుకున్నారు. టాలీవుడ్ ఈ రోజున బాలీవుడ్ తో పోటీ పడుతోంది అని ఆయన అన్నారు. అయితే హాలీవుడ్ తో పోటీ పడాలని ఆ కెపాసిటీ టాలెంట్ టాలీవుడ్ కి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.