శంకర్‌ని కార్నర్ చేసినా నో యూజ్!
సూర్య కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా `రెట్రో`. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు.;
సూర్య కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా `రెట్రో`. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. 80వ దశకం నేపథ్యంలో సాగే కథ కావడంతో దీనికి `రెట్రో` అని టైటిల్ పెట్టారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. సూర్య నటిస్తూ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ గురువారం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. తమిళంలో మినహా తెలుగులో ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు.
కారణం సూర్య నటించిన `కంగువా` బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలవడమే. అంతే కాకుండా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించిన `గేమ్ ఛేంజర్` డిజాస్టర్ కావడం మరో కారణం. ఈ రెండు కారణాల వల్ల `రెట్రో`కు పెద్దగా బజ్ లేకుండా పోయింది. చివరి నిమిషంలో కార్తీక్ సుబ్బరాజ్ `గేమ్ ఛేంజర్`పై సంచలన వ్యాఖ్యలు చేసినా నో యూజ్. ఈ మూవీకి తానే కథ అందించానని. ఓ కలెక్టర్ కథని అందిస్తే దాన్ని శంకర్ రైటర్స్‌ని పెట్టి అంతా మర్చిఏశారని, దీంతో నేను ఇచ్చిన కథ కనిపించకుండా పోయిందని, దాని వల్లే `గేమ్ ఛేంజర్` ఫ్లాప్ అయిందన్నాడు.
ఆ సినిమా ఫ్లాప్ కు కారణం దర్శకుడు శంకర్ అని తేల్చి చెప్పి తన తప్పేమీ లేదని చెప్పి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు. అయితే `రెట్రో` ఫలితం తప్పు శంకర్‌ది కాదు కార్తీక్ సుబ్బరాజ్‌దేనని, ఆయన ఇచ్చిన పసలేని కథ కారణంగానే `గేమ్ ఛేంజర్` ఫ్లాప్ అయిందని తేలిపోయింది. ఈ గురువారం విడుదలైన `రెట్రో` తెలుగులో డిజాస్టర్ అనిపించుకుంది. రివ్యూస్ 1.75 నుంచి 2 వరకు వచ్చాయంటే సినిమా ఏ స్థాయిలో నిరాశపరిచిందో అర్థం చేసుకోవచ్చు.
`రెట్రో` ఫలితాన్ని గమనించిన నెటిజన్‌లు, సినీ లవర్స్ ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్‌పై కామెంట్‌లు చేస్తున్నారు. పనిగట్టుకుని శంకర్‌ని కార్నర్ చేయాలని ప్రయత్నించినా నో యూజ్ అని, శంకర్ తప్పు చేశాడని నమ్మించే ప్రయత్నం చేసినా `రెట్రో` రిజల్ట్‌తో కార్తీక్‌సుబ్బరాజ్ వైపే వేళ్లనీ చూపిస్తున్నాయని, అతని తప్పు వల్లే `రెట్రో` కూడా ఫ్లాప్ అనిపించుకుందని సెటైర్లు వేస్తున్నారు.