• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రేణు దేశాయ్ మరింత అందంగా...

రేణు దేశాయ్ మరింత అందంగా మార్చిన అకీరా..!

| తాజాగా తన ఫోటోలను ఆమె షేర్ చేశారు. అందులో రేణు చాలా అందంగా కనపడింది. అయితే, అవి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాడిఫై చేసిన ఫోటోలు కావడం విశేషం.

By - Tupaki Desk
Update: 2023-07-15 13:26 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఆయనకు ఈ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. నిజానికి అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటే, పవన్ కి మాత్రమే భక్తులు ఉంటారు. ఎందుకంటే ఆయనను ఆయన ఫ్యాన్స్ దేవుడిలా భావిస్తారు. ఇక పవన్ , తన రెండో భార్య రేణు దేశాయ్ తో విడిపోయినా కూడా వదినా అంటూ ఆమెకు చాలా మంది మెసేజ్ లు పెడుతూ ఉంటారు.

ఇక ఎక్కవగా పవన్ కుమారుడు అకీరా గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఇక అకీరా ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ విషయంపై పవన్ కానీ, రేణు దేశాయ్ కానీ స్పందించడం లేదు. అయితే, అప్పుడప్పుడు రేణు తన ముద్దుల కుమారుడు అకీరా విశేషాలను మాత్రం సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.

కొన్ని సార్లు ఫోటోలు షేర్ చేయడం, మరి కొన్ని సార్లు కుమారుడు సాధించిన ఘనతలను పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఫోటోలను ఆమె షేర్ చేశారు. అందులో రేణు చాలా అందంగా కనపడింది. అయితే, అవి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాడిఫై చేసిన ఫోటోలు కావడం విశేషం.

ఈ మధ్యకాలంలో చాలా మంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా రకాల మ్యాజిక్ లు చేస్తున్నారు. టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఫోటోలను కూడా కొందరు అలానే చేశారు. అయితే, ఇప్పుడు అకీరా కూడా తన తల్లి ఫోటోలను విభిన్న ఆకారాల్లో చాలా అందంగా తయారు చేయడం గమనార్హం. ఈ విషయాన్ని తెలియజేస్తూ రేణు ఈ ఫోటోలను షేర్ చేసింది.

కాగా, ఈ ఫోటోల్లో రేణు చాలా అందంగా కనిపించింది. దీంతో, ఫ్యాన్స్ ఈ ఫోటోలు బాగున్నాయని, చాలా అందగా ఉన్నారు అని కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్కేయండి.

ఇక మరోవైపు రేణు దేశాయ్ చాలా కాలం తరువాత సినిమా ఇండస్ట్రీలో నటిగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చలో దశలో ఉన్నాయి.




Tags:    
  • RenuDesai 
  • Akira 
  • PawanKalyan 
  • SocialMediaPost 
  • AITools 
  • Gorgeous 
  • Movienews 

Similar News

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS