స‌ర్జ‌రీ త‌ర్వాత కూతురితో రేణూ!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య, అకీరా నంద‌న్, ఆద్య‌ల త‌ల్లి అయిన రేణూ దేశాయ్ రీసెంట్ గా ఇన్‌స్టా లో ఓ స్టోరీ పోస్ట్ చేశారు.;

Update: 2025-07-11 09:50 GMT

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య, అకీరా నంద‌న్, ఆద్య‌ల త‌ల్లి అయిన రేణూ దేశాయ్ రీసెంట్ గా ఇన్‌స్టా లో ఓ స్టోరీ పోస్ట్ చేశారు. రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప‌లు అంశాల‌పై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తూ ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాతా ఆమె ఓ సింపుల్ సెల్ఫీని పోస్ట్ చేయ‌గా ఆ ఫోటో అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.


ఈ సెల్ఫీలో రేణూ దేశాయ్, ఆద్య మాత్ర‌మే ఉన్నారు. అయితే నెటిజ‌న్ల దృష్టిని ఆకర్షిస్తోంది కేవ‌లం ఫోటో మాత్ర‌మే కాదు, ఆ ఫోటోతో పాటూ రేణూ రాసిన లైన్. రేణూ ఆ సెల్ఫీతో పాటూ మొత్తానికి స‌ర్జ‌రీ త‌ర్వాత నా క్యూటీల‌తో డిన్న‌ర్ కు వ‌చ్చాను అంటూ రాసుకొచ్చారు. అది చూసిన ఫ్యాన్స్ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ ఫోటోల్లో ఆద్య క్రీమ్ క‌ల‌ర్ డ్రెస్ లో క‌నిపించ‌గా, రేణు బ్లూ-బ్లాక్ చెక్ ష‌ర్ట్ ధ‌రించి ఇద్ద‌రూ ఎంతో రిలాక్డ్స్‌గా క‌నిపించారు.

అయితే నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షిస్తుంది వారి డ్రెస్సింగ్, అక్క‌డి వాతావర‌ణం కాదు. రేణూ స‌ర్జ‌రీ గురించి, అస‌లు దేని గురించి అనేది. అయితే ఆ స‌ర్జ‌రీ దేనిక‌నేది రేణూ ఎక్క‌డా ఎవ‌రితోనూ చెప్పింది లేదు. ఈ విష‌యంలో ఆమె ఎవ‌రికీ ఏమీ చెప్ప‌క‌పోయినా నెటిజ‌న్లు, ఆమె అభిమానులు మాత్రం ఆమెపై ప్రేమ కురిపిస్తూ ఉన్నారు. మీడియాకు, ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటూ పిల్ల‌ల‌ను పెంచ‌డంపై దృష్టి పెట్టిన రేణూకి ఈ ఫోటోను ప‌ర్స‌న‌ల్ గా ఫీలైన విష‌యం త‌న పోస్ట్ ద్వారా అర్థ‌మ‌వుతుంది.

అయితే రేణూ దేశాయ్ త‌న స‌ర్జ‌రీ గురించి త‌ర్వాతి పోస్ట్ లో ఏమైనా చెప్తారా లేదా అనేది చూస్తే ఆమె ఎవ‌రికీ ఏ విష‌యం చెప్పాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఎందుకంటే రేణూ షేర్ చేసిన ఆ సెల్ఫీలో ఆమె కోలుకుంటున్న విష‌యం చాలా స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే రేణూ తిరిగి నార్మ‌లై త‌న పిల్ల‌ల‌తో సంతోషంగా ఉంటున్న‌ప్పుడు జ‌రిగిన విష‌యాలు చెప్పాల్సిన అవ‌స‌రేముంది.

Tags:    

Similar News