• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప‌దేళ్లుగా...

ప‌దేళ్లుగా న‌టించ‌క‌పోయినా కోట్ల‌లో న‌టి సంప‌ద‌లు!

| కానీ ఈ సీనియ‌ర్ న‌టి పబ్లిక్‌గా కనిపించినప్పుడల్లా త‌న‌దైన‌ ముద్ర వేస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-06-30 03:45 GMT

పదేళ్లుగా నటనకు దూరంగా ఉండీ.. ఇప్పటికీ కోట్లలో సంపాదిస్తూ.. రూ. 100 కోట్ల సొంత ఇల్లు.. 332 కోట్ల నిక‌ర ఆస్తుల‌తో ఎప్ప‌టికీ అద్భుత‌మైన లైఫ్ స్టైల్ ని ఆస్వాధిస్తున్నారు స‌ద‌రు వెట‌ర‌న్ న‌టి. అగ్ర‌క‌థానాయిక‌గా ఉన్న రోజుల్లో త‌న అందంతో మ‌తులు చెడ‌గొట్టిన ఈ బ్యూటీ.. ఇప్ప‌టికీ 70 ఏళ్ల వ‌య‌సులోను స్టైల్ ఐకాన్ గా, క్వీన్ గా వెలిగిపోతున్నారు. ఈ అంద‌మైన న‌టి మ‌రెవ‌రో కాదు.. తెలుగు మూలాలున్న‌ ది గ్రేట్ రేఖ‌.

రేఖ తన కెరీర్‌లో 180కి పైగా చిత్రాలలో న‌టించారు. జాతీయ అవార్డు, పద్మశ్రీ సహా అనేక అవార్డులను గెలుచుకున్న రేఖ‌ గత 10 సంవత్సరాలుగా నటనకు దూరంగా ఉన్నారు. కానీ ఈ సీనియ‌ర్ న‌టి పబ్లిక్‌గా కనిపించినప్పుడల్లా త‌న‌దైన‌ ముద్ర వేస్తుంది.

బాలీవుడ్‌లోని ఎవర్‌గ్రీన్ నటీమణులలో రేఖను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న రేఖ చిన్న వయసులోనే నటనా ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. ఆమె ఎప్పుడూ హీరోయిన్ కావాలని కోరుకోలేదు.. కానీ పరిస్థితుల బలవంతం వ‌ల్ల న‌టన‌ను కెరీర్ మార్గంగా ఎంచుకోవలసి వచ్చింది. రేఖ సినిమాల్లోకి వచ్చి కోట్లాది మంది ప్రజల హృదయాలను శాసించింది. నేటికీ రేఖకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. 69 ఏళ్ల వయసులో అందం పరంగా నేటితరం హీరోయిన్లను సైతం ఢీకొంటుంది. రేఖ అసలు పేరు భానురేఖ గణేశన్.. కానీ రేఖగా పాపుల‌రైంది.

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రేఖ విలాసవంతమైన జీవనశైలిని కొన‌సాగిస్తూ.. త‌న ఆస్తుల‌ను పెంచుకుంటూ..విలాస‌వంత‌మైన‌ ఇల్లు జీవ‌న శైలితో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంది. రేఖకు ముంబైతో పాటు దక్షిణ భారతదేశంలో చాలా ఆస్తులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆస్తులు అద్దెకు ఇచ్చారు. దీని ద్వారా రేఖ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తుంది. రేఖ ముంబైలోని బ్యాండ్‌స్టాండ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. త‌న‌కు ఇరువైపులా షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ పొరుగువారు. రేఖ బంగళా `బసేరా` విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని స‌మాచారం. తాజా ప‌రిశోధ‌న‌ ప్రకారం.. రేఖ‌ నికర ఆస్తుల విలువ రూ. 332 కోట్లు.

రేఖకు ఆదాయం ఎలా వ‌స్తోంది? అంటే కేవ‌లం అద్దెల ద్వారా మాత్ర‌మే కాదు.. పెద్ద‌తెర కోసం న‌టించ‌క‌పోయినా.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి చాలా సంపాదిస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని టీవీ సీరియల్‌లను ప్రమోట్ చేస్తుంది.. ప్రచారం చేస్తుంది.. దాని కోసం భారీ పారితోషికాన్ని అందుకుంటోంది. తాజా క‌థ‌నాల ప్రకారం.. రేఖ తన ఫోటోను బిల్ బోర్డులపై ఉపయోగించేందుకు 10-20 లక్షలు వసూలు చేస్తుంది. రేఖకు కూడా కొన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని మీడియా కథనాలు వ‌చ్చాయి. న‌టిగా కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు వృధాగా ఖర్చు చేయకుండా తన సంపాదనను ఆదా చేసి ఎఫ్‌డిలలో పెట్టుబడి పెట్టారు. తన సంపాదనలో ఎక్కువ భాగం బ్యాంకు డిపాజిట్లలో పెట్టుబడి పెట్టింది.

రేఖ ఎప్పుడూ లేటెస్ట్ డిజైనర్ దుస్తులను ధరించరు. బట్టల కోసం అన‌వ‌స‌రంగా ఖర్చు చేయదు. బదులుగా త‌ను ధరించి కనిపించే పట్టు చీరలు ఎక్కువగా బహుమతులుగా వ‌చ్చ‌న‌వే. రేఖ తన వద్ద ఎక్కువసేపు సిబ్బందిని ఉంచుకోదు. ఇది అనవసరమైన ఖర్చుల నుండి కాపాడుతుంది. త‌న‌కు ఫర్జానా అనే ఒక కార్యదర్శి, ఆమెతో పాటు ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నారు. అతడు దశాబ్దాలుగా రేఖ వ‌ద్ద‌నే ప‌ని చేస్తున్నారు.

సీనియ‌ర్ న‌టి రేఖ పార్లమెంటు సభ్యురాలిగా, రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నప్పుడు త‌న‌కు ప్రతి సంవత్సరం భరణంతోపాటు రూ.65 లక్షల జీతం వచ్చేది. ఇది కాకుండా రేఖ ఏదైనా ప్రైవేట్ ఈవెంట్‌కి, వేడుకలకు వెళ్లినా.. అందుకు గాను లక్ష రూపాయలు తీసుకుంటుంది.

Tags:    
  • Bollywood 
  • Tollywood 
  • Filmindustry 
  • NationalAward 
  • PadmaShri 
  • Rekha 
  • BhanurekhaGanesan 

Similar News

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS