100 కోట్ల ఇంట్లో న‌టి ఒంట‌రి జీవితం

షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్, సల్మాన్ ఖాన్ బ్యాచిలర్ ప్యాడ్ `గెలాక్సీ` మధ్య 100 కోట్ల ఖ‌రీదైన విలాస‌వంత‌మైన‌ ఒక ఇల్లు ఉంది.;

Update: 2025-04-25 03:53 GMT

షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్, సల్మాన్ ఖాన్ బ్యాచిలర్ ప్యాడ్ `గెలాక్సీ` మధ్య 100 కోట్ల ఖ‌రీదైన విలాస‌వంత‌మైన‌ ఒక ఇల్లు ఉంది. ఇది భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన, ఖ‌రీదైన‌ స్థిరాస్తి. అయితే ఇది ఎవ‌రిది? అంటే.. లెజెండ‌రీ న‌టి రేఖకు చెందిన‌ది. ప్రస్తుతానికి రేఖ నికర ఆస్తుల‌ విలువ రూ. 332 కోట్లుగా అంచనా. త‌న ఆస్తుల‌లో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ పెట్టుబడులే. బసేరా భ‌వంతి విలువ‌ 100 కోట్లు. చాలా సంవత్సరాలుగా సినిమాల్లో నటించని రేఖ ప్రస్తుత ఏ-లిస్టర్లలో సగం మంది కంటే ఉత్త‌మంగా ఆర్జిస్తోంది.

బసేరాలో ఎంత మంది నివసిస్తున్నారు? అంటే ఈ ఇంటిలో న‌టి రేఖ మాత్రమే నివ‌శిస్తారు. దీని విలువ వంద కోట్లు ఉంటుందా? అంటే క‌చ్ఛితంగా ఉంటుంది. అరేబియా స‌ముద్రం ఎదుట సెలబ్రిటీలతో నిండి ఉన్న విలాస‌వంత‌మైన ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది గ‌నుక దీని విలువ భారీగా పెరిగింది. ఒక‌ప్ప‌టి రాజ‌కోట‌ను త‌ల‌పించే ఈ ఇంటి వెల దశాబ్ధాలుగా పెరుగుతూనే ఉంది.

బ‌సేరా సీఫేసింగ్ లో ఉండ‌టంతో, పెద్ద కిటికీలు సముద్రపు గాలిని సంగ్ర‌హిస్తాయి. ఈ ఇంటి లోప‌ల నిర్మాణ శైలి నిస్సందేహంగా రాజరికాన్ని త‌ల‌పిస్తుంది. ముదురు చెక్క శిల్పాలు, ఇత్తడి పొదిగిన ఫర్నిచర్, చేనేత వస్త్రాలు, పురాతన అద్దాలు వంటివి డ్ర‌మ‌టిగ్గా క‌నిపిస్తాయి. దక్షిణ భారత శాస్త్రీయ అంశాలను మిళితం చేసిన‌ నవాబీ అలంకరణతో ఆక‌ర్షిస్తాయి. ప్రతి గదికి ఒక పీరియడ్ ఫిల్మ్ సెట్ ప్ర‌ధ‌న ఆక‌ర్ష‌ణ‌. `బసేరా`లోని తోట కేవలం పచ్చిక బయలు మాత్ర‌మే కాదు.. ఆమె కథలోని ఒక పాత్ర. వెదురు గోడలు ..దట్టమైన ఆకులతో చుట్టిన‌.. వృక్షజాల కోటను త‌ల‌పిస్తుంది. ద‌క్షిణ భార‌త‌దేశం నుంచి వెళ్లి ముంబైలో స్థిర‌ప‌డిన న‌టి రేఖ‌. అక్క‌డ ప‌రిశ్ర‌మ‌లో అగ్ర న‌టిగా ఏలారు. ఇండ‌స్ట్రీ లెజెండ‌రీ న‌టుల‌తో క‌లిసి ప‌ని చేసారు. 70 ఏళ్ల వ‌య‌సులోను రేఖ నేటిత‌రంతో పోటీప‌డుతూ ఫ్యాష‌నిస్టాగా వెలిగిపోవడం చ‌ర్చ‌గా మారుతోంది.

Tags:    

Similar News