• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అప్పుడు వద్దన్నారు...

అప్పుడు వద్దన్నారు ఇప్పుడు కావాలంటున్నారు : రెజీనా

| అప్పట్లో వంద కోట్ల సినిమాలు కేవలం నార్త్‌కే సాధ్యం అయ్యేవి. అత్యధిక బడ్జెట్‌ సినిమాలను రూపొందించడంలో బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ముందు ఉండేవారు.

By - Tupaki Desk
Update: 2025-01-30 22:30 GMT

దశాబ్ద కాలం ముందు వరకు సౌత్‌ సినిమాలన్నా, సౌత్‌ సినిమా స్టార్స్‌ అన్నా, సౌత్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ అన్నా బాలీవుడ్‌ వారికి చిన్న చూపు ఉండేది. ప్రాంతీయ భాష చిత్రాలు అంటూ సౌత్ ఇండియన్‌ భాషల సినిమాలను వారు తక్కువ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనే స్థాయిలో అప్పట్లో బాలీవుడ్‌ వారి ఆదిపత్యం ఉండేది. అప్పట్లో వంద కోట్ల సినిమాలు కేవలం నార్త్‌కే సాధ్యం అయ్యేవి. అత్యధిక బడ్జెట్‌ సినిమాలను రూపొందించడంలో బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ముందు ఉండేవారు. నార్త్‌ సినిమాల బడ్జెట్‌తో పోల్చితే హిందీ సినిమాల బడ్జెట్‌ దాదాపు రెండు మూడు రెట్లు అధికంగా ఉండేది.

అక్కడి స్టార్స్ పారితోషికం సైతం సౌత్‌ వారి పారితోషికంతో పోల్చితే ఎక్కువగా ఉండేది. దాంతో సహజంగానే సౌత్‌ సినిమాలు అంటే అక్కడి వారిలో చిన్నచూపు ఉండేది. కానీ పరిస్థితులు మారుతూ వచ్చాయి. బాలీవుడ్‌ సినిమాలను మించి సౌత్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతున్నాయి. హిందీ సినిమాలకు మించి తెలుగు, తమిళ సినిమాలకు ఖర్చు చేస్తూ భారీ బడ్జెట్‌ సినిమాలను నిర్మిస్తున్నారు. కంటెంట్‌ పరంగానే కాకుండా క్వాలిటీ పరంగానూ సర్‌ప్రైజ్ చేస్తున్న సౌత్‌ సినిమాలు ఇండియన్‌ సినిమాను పూర్తిగా మార్చేశాయి. ఇండియన్‌ సినిమాకు మొదటి వెయ్యి కోట్ల వసూళ్లు చూపించింది సౌత్‌ సినిమా అనే విషయం తెల్సిందే. అందుకే సౌత్‌ స్టార్స్‌కి బాలీవుడ్‌లో మంచి డిమాండ్ పెరిగింది. తాజాగా హీరోయిన్‌ రెజీనా ఆ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తమిళ్‌ స్టార్‌ అజిత్‌ నటించిన 'విదాముయార్చి' సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటించగా కీలక పాత్రలో రెజీనా కనిపించబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో రెజీనా లుక్‌ రివీల్‌ అయ్యింది. చాలా రోజుల తర్వాత ఈ అమ్మడు సినిమాతో రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి ఫలితం దక్కుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ రెజీనా మాత్రం ఆఫర్ల విషయంలో చాలా నమ్మకంగా ఉంది. బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌ వారికి ఇప్పుడు సౌత్‌ స్టార్స్ అవసరం చాలా ఉందని చెప్పుకొచ్చింది.

రెజీనా మాట్లాడుతూ... బాలీవుడ్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. అందుకే వారికి ఇప్పుడు వేరే అవకాశం లేదు. కనుక సౌత్‌ స్టార్స్‌తో వర్క్‌ చేయాలి. ఇక్కడి వారితో సినిమాలు చేస్తేనే హిందీ సినిమాను సౌత్‌లోనూ చూస్తారని వారికి తెలుసు. అందుకే సౌత్‌లో పాపులర్‌ అయిన వారిని తమ సినిమాల్లో నటింపజేసేందుకు వారు ఎగబడుతున్నారని చెప్పుకొచ్చింది. అప్పుడు వద్దు అని అన్నవారే ఇప్పుడు కావాలని వెంటపడుతున్నారని అంది. బాలీవుడ్‌ నుంచి తనకు ఆఫర్‌ వచ్చిందని, ఇప్పటికే ఆ సినిమాకు సైన్‌ చేశానని రెజీనా చెప్పుకొచ్చింది. సౌత్‌లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌ నుంచి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినిమాల్లో నటిస్తాను అంటూ రెజీనా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. సౌత్‌లో ఆఫర్లు తగ్గిన ఈ సమయంలో బాలీవుడ్‌ నుంచి పిలుపు రావడంతో రెజీనా అక్కడ కొన్నాళ్ల పాటు సందడి చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    
  • SouthStars 
  • Bollywood 
  • Regina 
  • SouthIndianCinema 
  • Bollywoodnews 
  • Ajith 
  • Trisha 
  • Vidamuyaarchi 
  • FilmIndustry 
  • Kollywood 
  • Reginamovies 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS