ఆ బ్యూటీ ఓ వారియర్ లా పని చేస్తోందే!
తెలివిగా అవకాశాలు కల్పించుకుంటుంది. ఒక్క భాషకు పరిమితం కాకుండా వచ్చిన ఏ భాషలోనూ కాదనకుండా కమిట్ అవుతోంది.;
రెజీనా కసాండ్రా పరిచయం అవసరం లేని పేరు. దక్షిణాదిన మాలీవుడ్ మినహా అన్నీ భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగు, తమిళం లో చాలా సినిమాలు చేసింది. కన్నడని సైతం టచ్ చేసింది. కానీ అమ్మడికి ర ఆవాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. చెప్పుకోవడానికి చాలా సినిమాలు చేసింది. కానీ రెండు దశాబ్దాల ప్రయాణంలో తనదైన ముద్ర మాత్రం వేయలేకపోయింది. చివరికి ఐటం భామగా సైతం టర్నింగ్ తీసుకుంది. అక్కడా సక్సెస్ అవ్వలేదు. ఒక్క పాటతోనే వెను దిరిగింది. ఆ తర్వాత ఐటం పాటల్లో అవకాశాలు రాలేదు.
ఈ మధ్య కాలంలో హిందీలో కూడా సినిమాలు మొదలు పెట్టింది. కెరీర్ మిడ్ లో హిందీలోనూ ఓ సినిమా చేసింది కానీ ఆ తర్వాత అక్కడా బిజీ అవ్వలేదు. తెలుగు సినిమాల పరంగా చూస్తే మాత్రం రెండేళ్లగా ఎక్కడా కనిపించలేదు. చివరిగా 2024 లో `ఉత్సవం`లో నటించింది. ఆ తర్వాత అమ్మడి జాడ టాలీవుడ్ లో లేదు. కానీ తమిళ, హిందీ సినిమాల్లో మాత్రం కంటున్యూ అవుతుంది. ఇలా విజయాలు లేకుండా కెరీర్ ముందుకు సాగించడం అన్నది చిన్న విషయం కాదు. ఆ విషయంలో అమ్మడు నిజంగా ఓ వారియర్ లాగే ఇండస్ట్రీలో పని చేస్తోంది.
తెలివిగా అవకాశాలు కల్పించుకుంటుంది. ఒక్క భాషకు పరిమితం కాకుండా వచ్చిన ఏ భాషలోనూ కాదనకుండా కమిట్ అవుతోంది. ప్రస్తుతం తమిళ్ లో `ప్లాష్ బ్యాక్`, `ముకుత్తు అమ్మన్ 2`లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల్లో `ముకుత్తు అమ్మన్` పై మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి భాగం భారీ విజయం సాధించిన నేపత్యంలో రెండవ భాగం కోసం తమిళ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో మాత్రం `దివేవ్స్`, `సెక్షన్ 108` లోనూ నటిస్తోంది. సెక్షన్ 108 ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సెట్స్ లో ఉన్న మిగతా చిత్రాలు కూడా ఏడాది ముగింపులోపు రిలీజ్ కానున్నాయి. విజయాలు లేకుండా ఇంత లాంగ్ కెరీర్ ను ఇంత వరకూ ఏ నటి కొనసాగించలేదు. ఆ రకంగా రెజీనా రికార్డు సృష్టించింది. విజయాలు అందుకున్న భామలే ఉన్న కాంపిటీషన్ లో కొత్త అవకాశం అందుకోవడం కష్టంగా మారింది. కానీ రెజీనా మాత్రం ఆ పోటీని కూడా తట్టుకుని ఫాంలో లేకపోయినా? ఛాన్సులందుకోవడం గొప్ప విషయం. ఇక రెజీనా జీవితంలో మిగిలింది పెళ్లి ఒక్కటే. ఇప్పటికే 35 ఏళ్లు నిండాయి. ఏఫైర్స్ విషయంలో అమ్మడి పేరు తెరపైకి వచ్చిన సందర్బాలు చాలా అరుదు. మరి ధాంపత్య జీవితంలోకి ఎప్పుడు అడుగు పెడుతుందో.