• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  న‌వ‌దీప్ 2.Oకి మాస్...

న‌వ‌దీప్ 2.Oకి మాస్ మ‌హారాజ్ మ‌ద్ధ‌తు

| రవితేజ నటించిన 'ఈగల్' చిత్రంలో నవదీప్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. 'ఈగల్' ట్రైలర్‌ చూస్తుంటే.. నవదీప్ పాత్రకు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉందనేది అర్థమవుతోంది.

By - Tupaki Desk
Update: 2024-01-05 15:19 GMT

నవదీప్ కొంత విరామం తర్వాత 'లవ్ మౌళి'గా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. నైరా క్రియేషన్స్ - శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో క‌లిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు 'ద యాంథమ్ ఆఫ్ ల‌వ్ మౌళి' సాంగ్‌ మంచి స్పంద‌నను రాబట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ వీడియోలో కంటెంట్‌లో నవదీప్ డిఫ‌రెంట్‌గా కనిపించడంతో న‌వ‌దీప్ 2.Oగా అభిమానులు వర్ణిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఆడియో జూక్‌ బాక్స్ ని మాస్ మహారాజా రవితేజ విడుదల చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.


హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో పాటలను వినూత్నంగా విడుదల చేశారు. ఈ సినిమాలోని పాటలను ఎవరైతే పాడారో.. వారితోనే ఆ పాటను ఈ ఈవెంట్‌లో పాడించి.. అదే పాటను వారిచేతే విడుదల చేయించారు. అనంతరం పాటలన్నీ కలిపి ఉన్న జూక్‌బాక్స్‌ని స్టార్ హీరో రవితేజ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. రవితేజ నటించిన 'ఈగల్' చిత్రంలో నవదీప్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. 'ఈగల్' ట్రైలర్‌ చూస్తుంటే.. నవదీప్ పాత్రకు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉందనేది అర్థమవుతోంది. 'లవ్ మౌళి' సినిమాలోని పాటలను ఇలా వినూత్నంగా విడుదల చేయడం.. అలాగే మాస్ రాజా రవితేజగారు జూక్ బాక్స్ విడుదల చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని హీరో నవదీప్ అన్నారు. నా ఆలోచ‌న విధానానికి, నేను చేయాల‌నుకుంటున్న సినిమాల‌కు 'ల‌వ్, మౌళి' ద‌గ్గ‌ర‌గా అనిపించింది. అందుకే మీ ముందుకు స‌రికొత్త చిత్రంతో రాబోతున్నానని నవదీప్ తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి బ్యానర్లు: నైరా క్రియేషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్. గోవింద్ వసంత సంగీతం అందించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ర‌చ‌న, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: అవనీంద్ర.

Tags:    
  • Tollywood 
  • Navdeep 
  • Lovemouli 
  • Lovemoulimovie 
  • Massmaharaja 
  • Raviteja 
  • Launches 
  • Jukebox 
  • Govindvasantha 
  • Pankhurigidwani 

Similar News

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS