మాస్ రాజాతో డైరెక్టర్ బాకీ అలానే ఉందా..?

ఆ తర్వాత బాలకృష్ణతో వీర సింహా రెడ్డి తీసిన గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ తో జాత్ అంటూ బాలీవుడ్ సినిమా తీసి సక్సెస్ అందుకున్నారు.;

Update: 2025-04-30 05:21 GMT

కొన్ని కాంబినేషన్ లో సినిమాలు ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తాయి. అలాంటి కాంబినేషన్ లో ఒకటి మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేనిది. గోపీచంద్ తో డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు చేశాడు రవితేజ. క్రాక్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అవ్వడమే కాదు రవితేజని తిరిగి సక్సెస్ ఫాం లోకి తెచ్చింది. క్రాక్ తర్వాత మళ్లీ గోపీచంద్, రవితేజ కాంబో సినిమా ఒకటి అనుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా అనౌన్స్ కూడా చేశారు. కానీ ఏమైందో ఏమో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది.

ఆ తర్వాత బాలకృష్ణతో వీర సింహా రెడ్డి తీసిన గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ తో జాత్ అంటూ బాలీవుడ్ సినిమా తీసి సక్సెస్ అందుకున్నారు. సన్నీ డియోల్ లోని మాస్ పొటెన్షియల్ ని పర్ఫెక్ట్ గా వాడుకుని గోపీచంద్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు గోపీచంద్ కి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. ఐతే నెక్స్ట్ గోపీచంద్ మలినేని మరోసారి బాలయ్యని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ మాస్ మూవీగా ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత క్రాక్ 2 ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. రీసెంట్ గా గోపీచంద్ మలినేని ఇంటర్వ్యూలో రవితేజతో సినిమా ఉంటుందని అది క్రాక్ 2 అవుతుందా లేదా అన్నది తర్వాత తెలుస్తుందని అన్నారు. ఈసారి రవితేజతో చేసే సినిమా మాత్రం మాస్ రాజా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని అన్నాడు గోపీచంద్ మలినేని. సో రవితేజతో ఆల్రెడీ ఆయనది సూపర్ హిట్ కాంబో కాబట్టి తప్పకుండా ఈ ఇద్దరు మరోసారి అదరగొట్టేస్తారని అనిపిస్తుంది.

రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరో సినిమా లైన్ లో ఉంది. మరోపక్క గోపీచంద్ మలినేని కూడా బాలకృష్ణతో సినిమా పూర్తి చేశాక రవితేజతో సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి క్రాక్ కాంబో మళ్లీ కలిస్తే మాత్రం మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పక్కా అని చెప్పొచ్చు. మరి ఈసారి ఎలాంటి కథతో ఈ ఇద్దరు కలిసి వస్తారన్నది చూడాలి. రవితేజకి మళ్లీ ఒక మాస్ హిట్ పడాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.

Tags:    

Similar News