వాళ్లిద్దరి మధ్యలో రాజా మళ్లీ మొదటికా!
మాస్ ఇమేజ్ ఉన్న రవితేజ `భర్తమహాశయులు` లాంటి కాన్సెప్ట్ లో నటిస్తుండటంతో? కథలో రాజా పాత్ర ఎలా ఉంటుంది? అన్నది అందరిలోనూ ఓ సస్పెన్స్.;
మాస్ ఇమేజ్ ఉన్న రవితేజ `భర్తమహాశయులు` లాంటి కాన్సెప్ట్ లో నటిస్తుండటంతో? కథలో రాజా పాత్ర ఎలా ఉంటుంది? అన్నది అందరిలోనూ ఓ సస్పెన్స్. ఈ కథను డీల్ చేస్తోన్న కిషోర్ తిరుమల సెన్సిబుల్ డైరెక్టర్. ఎలాంటి పాయింట్ అయినా సున్నితంగా అందంగా చెప్పడం అతడి ప్రత్యేకత. డిజాస్టర్ అనే సినిమా ఇంత వరకూ అతడి ఖాతాలో లేదు. `భర్త మహాశయులు` అనే టైటిల్ ని బట్టే ఇదో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. కానీ అందులో కిషోర్ మార్క్ తప్పని సరి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఈ సినిమా రవితేజ మాస్ యాంగిల్ కి కాస్త దూరం జరిగి పని చేస్తున్నాడా? అన్న సందేహం అందరిలో ఉంది.
వరుస ప్లాప్ ల పరంపరలో `భర్తమహశయులు` ఉపశమనం ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. రిలీజ్ కు ముందు దీన్ని ఓ పాజిటివ్ సైన్ గాచెప్పొచ్చు. ఇదే పరంపరలో మరో క్లాసిక్ డైరెక్టర్ రవితేజకు జత అయ్యాడు. అతడే శివ నిర్వాణ. ఇద్దరి కాంబినేషన్ లో ఓ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కుతుందంటూ ప్రచారం మొదలైంది. క్రైమ్ థ్రిల్లర్ అంటే రవితేజకు కొత్తేం కాదు. ఇప్పటికే ఈ జానర్ లో చాలా సినిమాలు చేసాడు. కానీ శివ నిర్వాణకు మాత్రం కొత్త ప్రయత్నమనే చెప్పాలి.
ఇంత వరకూ శివ కేవలం క్లాసిక్ లవ్ స్టోరీలు మాత్రమే డీల్ చేసాడు. తన ప్రేమ కథని తెలివిగా ఎమోషన్ తో ప్రేక్షకులకు కనెక్ట్ చేసాడు. `ఖుషీ` సహా అదే ప్యాట్రన్ లో సాగినా డివైడ్ టాక్ తో బయట పడింది. నానితో `టక్ జగదీష్` అంటూ యక్షన్ డ్రామా ప్రయత్నించాడు కానీ ఫలించలేదు. ఈ జానర్ శికు పూర్తిగా కొత్త. మరి క్రైమ్ థ్రిల్లర్లలో ఆరితేరిన రవితేజను శివ ఎంత కొత్తగా చూపిస్తాడు? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. క్రైమ్ థ్రిల్లర్ జానర్లు ఆడియన్స్ కొత్తేం కాదు. సస్పెన్స్ థ్రిల్లర్స్, ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రాలకు ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ సబ్జెక్ట్ లుగా మారాయి.
వాస్తవ సంఘటనల స్పూర్తితో కథలు అల్లి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తున్నారు.క్రైమ్ జానర్లో ప్రేక్షకులకు వీలైనంత కొత్త అనుభూతిని పంచడం కోసం రైటర్స్ కం మేకర్స్ ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. మరి రవితేజ కోసం శివ రాసిన క్రైమ్ థ్రిల్లర్ ఎంత కొత్తగా ఉంటుంది? క్రైమ్ కథల్లో శివ ఎంత ఇన్నో వేటివ్ గా ఉన్నాడు? అన్నది చూడాలి. అలాగే క్రైమ్ థ్రిల్లర్ అంటే రవితేజ మార్క్ యాక్షన్ ఎలివేషన్ ఎలాగూ ఉంటుంది. కిషోర్ ప్లేవర్ నుంచి బయటకు రాగేనే రాజా వెంటనే మళ్లీ ఓల్డ్ గెటప్ లోకి ఎక్కిపోతాడు.