ఫంకీ రవితేజ అందుకే కాదన్నాడా..?
ఐతే ఫంకీ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందు అనుదీప్ కెవి మాస్ మహరాజ్ రవితేజతో సినిమా చర్చ నడిచింది.;
జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనుదీప్ కెవి నెక్స్ట్ కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. ఆ సినిమా కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇక తన నెక్స్ట్ సినిమా ఫంకీతో వస్తున్నాడు అనుదీప్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఫంకీ టీజర్ చూసిన ఆడియన్స్ మరోసారి అనుదీప్ మార్క్ ఎంటర్టైనర్ లోడింగ్ అనేస్తున్నారు.
అనుదీప్ కెవి మాస్ మహరాజ్ రవితేజతో సినిమా..
ఐతే ఫంకీ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందు అనుదీప్ కెవి మాస్ మహరాజ్ రవితేజతో సినిమా చర్చ నడిచింది. ఐతే ఏమైందో ఏమో కానీ ఈ కాంబినేషన్ సినిమా పట్టాలెక్కలేదు. ఐతే రవితేజతో తీయాలనుకున్న ఆ సినిమానే విశ్వక్ సేన్ తో ఫంకీగా చేస్తున్నాడని ఇన్నర్ టాక్. ఫంకీ టీజర్ చూస్తే రవితేజ ఎందుకు ఈ సినిమా కాదనుకున్నాడా అన్న డిస్కషన్ మొదలైంది.
ఐతే ఫంకీ సినిమాలో హీరో ఒక డైరెక్టర్ సో ఆల్రెడీ రవితేజ నేనింతే సినిమాలో డైరెక్టర్ గా చేశాడు. బహుశా అందుకే అనుదీప్ ఆఫర్ ని రిజెక్ట్ చేసి ఉండొచ్చని అంటున్నారు. ఐతే మరో పాయింట్ ఏంటంటే మాస్ జాతర కోసం రవితేజ అనుదీప్ ఫంకీ కాదనుకున్నాడని చెబుతున్నారు. ఐతే ఫంకీ ఇంకా రిలీజ్ కాలేదు టీజర్ కూడా ఆసక్తిగా ఉంది. కానీ రవితేజ మాస్ జాతర రిలీజై డిజాస్టర్ అనిపించుకుంది.
రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా,,
సో రవితేజ ఫంకీ చేసి ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతకీ విశ్వక్ సేన్ ఫంకీ అనుదీప్ నిజంగానే రవితేజతో చేయాలని అనుకున్నాడా లేదా మరో కథతో రవితేజతో అప్రోచ్ అయ్యాడా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ రవితేజతో అనుదీప్ వేరే కథ చెప్పి ఉంటే మాత్రం ఫంకీ తర్వాత రవితేజకు అనుదీప్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్నాడు.
కాస్త లేట్ అయినా కూడా రవితేజ ఎనర్జీకి అనుదీప్ మార్క్ కామెడీ సినిమా ఒకటి పడితే చూడాలని తెలుగు ఆడియన్స్ ఆశిస్తున్నారు. ఈ కాంబో సెట్ అయితే మాత్రం ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. రవితేజ కూడా వరుస ఫ్లాపులతో కాస్త డిజప్పాయింట్ తో ఉన్నాడు. అందుకే హిట్ ఇచ్చే డైరెక్టర్ వేటలో పడ్డాడు మాస్ రాజా. ఫంకీ హిట్ పడితే మాత్రం తప్పకుండా రవితేజ, అనుదీప్ కాంబో కుదిరే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.