ట్రోల్స్ వచ్చినా.. ఆ పాటలాగే ఓలే ఓలే కూడా సూపర్ హిట్ అవుతుందా?

మాస్ మహారాజ మాస్ జాతర సినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా ఆగస్టు 27న రిలీజ్ కానుంది.;

Update: 2025-08-08 08:27 GMT

మాస్ మహారాజ మాస్ జాతర సినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా ఆగస్టు 27న రిలీజ్ కానుంది. భానూ భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. భీమ్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ క్రమంలోనే మేకర్స్ ఇటీవల ఓ సినిమాలో నుంచి ఓ పాట రిలీజ్ చేశారు.

ఓలే ఓలే అనే పాట రిలీజైంది. ఈ పాటకు భాస్కర్ యాదవ్ దాసరి లిరిక్స్ అందించగా, భీమ్స్, రోహిని పాడారు. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ప్రోమో చూస్తుంటే రవితేజ- శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు అదిపోయినట్లు తెలుస్తోంది. అంతాబాగుంది కానీ, ఈ పాటపై విపరీతమైన ట్రోలింగ్ వస్తుంది. నెటిజన్లు ఈ పాటను విమర్శిస్తున్నారు.

పాటలో.. నీ తల్లిని, నీ చెల్లిని, నీయమ్మనీ, నీ యక్కని, వంటి లిరిక్స్ నెటిజన్ల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. ఇవి వినడానికి ఎబ్బేట్టుగా ఉందని మ్యూజిక్ లవర్స్ పేర్కొంటున్నారు. పాట విన్న తర్వాత, ఒక నెటిజన్ ఫేస్‌బుక్‌ లో రవితేజ సినిమాలు చేయడం మానేయడం మంచిదని నేను భావిస్తున్నాను. అని కామెంట్ రాసుకొచ్చారు.

ఆ నెటిజన్ అభిప్రాయాన్ని అనేక మంది సోషల్ మీడియా యూజర్లు సమర్థించారు. కొందరైతే రవితేజ ఇలాంటి పాటకు ఒప్పుకున్నందుకు ఆయనను కూడా విమర్శిస్తున్నారు. అతని బిరుదు మాస్ మహారాజా. మాకు అది అర్థం చేసుకుంటాం. అంతేకానీ దాని అర్థం ఇలాంటి అసభ్యతను ప్రోత్సహించమని కాదు. అని మరొక యూజర్ కామెంట్ చేశారు.

అయితే యాదృచ్ఛికంగా అప్పట్లో గుంటూరు కారంలోని కుర్చి మడతపెట్టి పాట కూడా ప్రారంభంలో యూట్యూబ్‌లో విడుదలైన సమయంలో ఇలానే విమర్శలు ఎదుర్కొంది. కుర్చి మడతపెట్టి.. ఏంటని ఇలాంటి టైటిల్ ఏంటని చాలా మంది విమర్శించారు. ఎందుకంటే ఈ డైలాగ్ తదుపరి ఓ బుతు పదం ఉంది. అది ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. అందుకే విమర్శించారు.

ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ, ఈ పాట బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. చివరికి ప్రేక్షకులు దీనిని అంగీకరించమే కాదు దీనికి వైబ్ అవుతున్నారు కూడా. మాస్ జాతర నిర్మాతలు కూడా ఈ పాటపై వస్తున్న ట్రోల్స్ విమర్శలను పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ పాట కూడా గుంటూరు కారం సాంగ్లా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News