ఓలే ఓలే.. మాస్ జాతరలో మరో మాస్ బీట్!

లేటెస్ట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రెండవ పాట 'ఓలే ఓలే' కూడా అదే స్థాయిలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో తనదైన శైలిలో కంపోజ్ చేశారు.;

Update: 2025-08-05 10:50 GMT

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తో కొనసాగుతున్నాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న సినిమా 'మాస్ జాతర'. 75వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.


సినిమా కథ, కమర్షియల్ ఎలిమెంట్స్, వినూత్నమైన ప్రెజెంటేషన్‌తో ఈసారి రవితేజను మరింత మాస్ ఫీవర్‌ తో ప్రజెంట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, చక్రి గారి AI వాయిస్ తో వచ్చిన ఫస్ట్ సింగిల్ తు మేరా లవర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ ను తీసుకొచ్చాయి. ఇక రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో క్రేజే వేరు. గతంలో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జోడీ మరోసారి తెరపై మెప్పించబోతుందనే హైప్ క్రియేట్ అయింది.

మాస్ మహారాజా, శ్రీలీల కెమిస్ట్రీ సినిమాకే స్పెషల్ హైలైట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. లేటెస్ట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రెండవ పాట 'ఓలే ఓలే' కూడా అదే స్థాయిలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో తనదైన శైలిలో కంపోజ్ చేశారు. మాస్, ఎనర్జిటిక్ బీట్ తో వినిపించే ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులకు పండగలా మారింది.

రవితేజ స్టెప్పులకు శ్రీలీల మ్యాజిక్ కూడా తోడై, మాస్ లవర్స్ థియేటర్లలో విజిల్స్ వేస్తారనే నమ్మకం పెరిగింది. రోహిణి గాత్రం పాటకు మరింత జోష్ ఇచ్చింది. అలాగే భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యం నేటివిటీ మాస్ ఫ్లేవర్‌తో ఆకట్టుకుంటోంది. ఓలే ఓలే పాటలో రవితేజ తన వింటేజ్ ఎనర్జీని చూపించారు. ఎప్పటిలాగే హై వోల్టేజ్ డ్యాన్స్, ఫుల్ ఎనర్జీతో తన స్టైల్ చూపించారు. శ్రీలీల తన చలాకితనం, డాన్స్ స్టెప్పులతో సాంగ్‌లో కొత్తదనాన్ని తీసుకొచ్చింది.

ఇద్దరూ కలసి చేసిన డ్యాన్స్ అభిమానులని ఉర్రూతలూగించేలా ఉంది. తెరపై కనిపించే విజువల్స్, లిరికల్ వీడియో కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. మాస్ జాతర సినిమాకే కాకుండా ఈ సాంగ్ థియేటర్లలో వన్ మోర్ అనే లెవల్‌లో సాగుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈమధ్య కాలంలో ఎలాంటి సినిమాలు చేసినా ఆదరగొట్టేస్తున్నాడు. మాస్ జాతర కోసం కూడా హిట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నారని సాంగ్ ద్వారా క్లియర్ అయింది.

ఇక ఈ నెల 27న 'మాస్ జాతర' గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, ఈ రెండవ పాట విడుదల ఫ్యాన్స్ లో సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రేంజ్‌లో వసూళ్లు సాధించడమే లక్ష్యంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. రవితేజ వింటేజ్ మాస్ యాక్టింగ్, శ్రీలీల ఎనర్జీ, భీమ్స్ మ్యూజిక్ తో ఈసారి 'మాస్ జాతర' ఎలాంటి మాస్ కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News