‘ఇరుముడి’ తర్వాత రవితేజ లైనప్‌లో అసలు మార్పు ఇదే!

రవితేజకు ‘ఇరుముడి’ చాలా అవసరమైన సమయంలో పడిన సినిమా. వరుసగా మాస్, యాక్షన్ సినిమాలు చేసినా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు రాలేదు.

Update: 2026-08-22 11:30 GMT

రవితేజకు ‘ఇరుముడి’ చాలా అవసరమైన సమయంలో పడిన సినిమా. వరుసగా మాస్, యాక్షన్ సినిమాలు చేసినా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు రాలేదు. అలాంటి టైమ్‌లో శివ నిర్వాణతో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ చేయడం మొదట్లోనే కాస్త కొత్తగా అనిపించింది. ఇప్పుడు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆ మార్పు వర్కవుట్ అయినట్టే కనిపిస్తోంది.

అయితే ‘ఇరుముడి’ తర్వాత రవితేజ మళ్లీ వెంటనే పాత మాస్ రూట్‌లోకి వెళ్లడం లేదు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో హసిత్ గోలి, వివేక్ ఆత్రేయ సినిమాలు ఉన్నాయి. ఇద్దరూ ఇప్పటివరకు రెగ్యులర్ స్టార్ హీరో ఫార్ములాతో సినిమాలు చేసిన దర్శకులు కాదు. వాళ్ల సినిమాల్లో కథ, క్యారెక్టర్స్, కామెడీకి ఒక ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్ ఉంటుంది. అందుకే ‘ఇరుముడి’ హిట్ కంటే.. దాని తర్వాత రవితేజ లైనప్ లో ఉన్న ఈ ఇద్దరు దర్శకుల మీదే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

ముందుగా హసిత్ గోలి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’తో తనకంటూ ఒక స్టైల్ చూపించిన హసిత్.. ఈసారి రవితేజతో పాటు శ్రీవిష్ణును కూడా ఒకే సినిమాలో తీసుకొస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మించనున్న ఈ మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్‌ను సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదట్లో ప్రారంభించే ప్లాన్ ఉన్నట్లు రిపోర్ట్స్ ఉన్నాయి.

ఇక్కడ రవితేజ శ్రీవిష్ణు కాంబినేషన్ కూడా మంచి ఛాయిసే. ఇద్దరికీ కామెడీ టైమింగ్ ఉంది కానీ స్క్రీన్ మీద చూపించే విధానం వేరు. పైగా హసిత్ ఇప్పటికే శ్రీవిష్ణుతో ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చేశారు. ఇప్పుడు అదే దర్శకుడు రవితేజ ఎనర్జీని తన స్టైల్‌లో ఎలా వాడుకుంటారన్నది చూడాలి. ఈ సినిమాను 2027 సంక్రాంతికి తీసుకురావాలనే ప్లాన్ ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఆ తర్వాత వివేక్ ఆత్రేయతో సినిమా కూడా లైన్లో ఉంది. మొదట ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల నిర్మాత మారినట్లు, లక్ష్మణ్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. కథ విషయంలో ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు. అంటే ‘ఇరుముడి’తో వచ్చిన ఫలితం తర్వాత రవితేజ ముందు ఉన్న లైనప్‌ను చూస్తే ఒక విషయం మాత్రం ఆసక్తికరంగా ఉంది. వరుసగా ఒకే తరహా ఫ్యామిలీ సినిమా చేయడం లేదు.. అలాగే మళ్లీ వరుస మాస్ దర్శకుల దగ్గరికీ వెళ్లడం లేదు. మరి ఈ లైనప్ లో ఎలాంటి విజయాలు అందుతాయో చూడాలి.

Tags:    

Similar News