మాస్ వల్ల కావట్లేదు.. ఫ్యామిలీ అస్త్రంతో మాస్ రాజా..?
ఐతే సినిమా తీయడమే తన పని రిజల్ట్ ఆడియన్స్ చేతుల్లో ఉందని నమ్మే రవితేజ ఇలా మాస్ జాతర రిలీజైందో లేదో అలా నెక్స్ట్ సినిమాకు షిఫ్ట్ అయ్యాడు.;
మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విషయంలో హై ఎక్స్ పెక్టేషన్స్ వల్లో ఏమో కానీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమాలో రవితేజ సరసన శ్రీలీల నటించింది. ధమాకా కాంబో కాబట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తుందని అనుకున్నారు. కానీ ఆ రేంజ్ లో అయితే లేదన్నది ఆడియన్స్ టాక్. ఐతే సినిమా తీయడమే తన పని రిజల్ట్ ఆడియన్స్ చేతుల్లో ఉందని నమ్మే రవితేజ ఇలా మాస్ జాతర రిలీజైందో లేదో అలా నెక్స్ట్ సినిమాకు షిఫ్ట్ అయ్యాడు.
నేను శైలజ నుంచి ఆడవాళ్లు మీకు జోహార్లు వరకు..
ఐతే ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు రవితేజ. నేను శైలజ నుంచి ఆడవాళ్లు మీకు జోహార్లు వరకు కంప్లీట్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ వచ్చిన కిషోర్ తిరుమలతో రవితేజ సినిమా వస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా భర్తమహాశయులకు విజ్ఞప్తి అని పెట్టబోతున్నారని టాక్. రవితేజకు మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వారి కోసమే భర్తమహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు.
రవితేజ లో కేవలం మాస్ మాత్రమే కాదు ఒక మంచి ఎంటర్టైనర్ కూడా ఉన్నాడు. ఆయన పంచ్ డైలాగ్స్ కి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. వాటితో పాటు రవితేజ ఎమోషనల్ సీన్స్ ఇరగ్గొట్టేస్తాడు. అందుకే రవితేజతో ఎమోషన్ విత్ ఎంటర్టైనర్ గా కిషోర్ తిరుమల సినిమా వస్తుంది. ఐతే ఈ సినిమా విషయంలో ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ మించి సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా అటు మాస్ అంశాలు ఉంటూనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది.
భద్ర లాంటి ఫ్యామిలీ ఎమోషన్ విత్ మాస్ ఎలిమెంట్స్..
ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో నా సామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తుంది. రవితేజ నుంచి భద్ర లాంటి ఫ్యామిలీ ఎమోషన్ విత్ మాస్ సినిమా వచ్చి చాలా రోజులైంది. మధ్యలో చాలా ప్రయోగాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు. అందుకే ఈసారి ఫ్యామిలీ సినిమాతో రాబోతున్నాడు. రవితేజ ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఇదే తరహా సినిమాలు మరికొన్ని లైన్ లో పెట్టే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం కిషోర్ తిరుమల సినిమా మాత్రమే చేస్తున్న రవితేజ ఈ మూవీ పూర్తయ్యాక నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తాడని తెలుస్తుంది. రవితేజ మాస్ ఎనర్జీ తెలుసు అయితే ఈమధ్య ఆయన మాస్ సినిమాలు అంచనాలను అందుకోవట్లేదు. మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయినా ఫ్యాన్స్ ని మెప్పిస్తాయేమో చూడాలి.