ఇరుముడితో విశ్వనాథ్‌కి గట్టి దెబ్బ?

కానీ సినిమాకు చేసిన ప్రమోషన్స్‌, వచ్చిన టాక్‌ నేపథ్యంలో ఇరుముడి కారణంగా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ కి గట్టి దెబ్బ తగిలిందని చెప్పక తప్పదు.

Update: 2026-08-22 08:30 GMT

రవితేజ ప్రధాన పాత్రలో నటించి, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'ఇరుముడి' సినిమాకు ఫ్యాన్స్‌, ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా రివ్యూవర్స్ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో భారీ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను ఇరుముడి దక్కించుకోబోతుంది. లాంగ్‌ వీకెండ్‌ కలిసి రావడంతో పాటు, పలు అంశాలు ఈ సినిమాకు కలిసి వస్తున్నాయనే అభిప్రాయం ను సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విడుదల ముందు వరకు ఇరుముడి సినిమాకు 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' సినిమా కాస్త పోటీ అన్నట్లుగా భావించారు. అప్పటికే సెటిల్‌ అయ్యి ఉన్న విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ సినిమాను ఢీ కొట్టి ఇరుముడికి ప్రేక్షకులను రప్పించాలంటే చాలా పెద్ద టాస్క్‌ అని విశ్లేషకులు భావించారు. కానీ సినిమాకు చేసిన ప్రమోషన్స్‌, వచ్చిన టాక్‌ నేపథ్యంలో ఇరుముడి కారణంగా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ కి గట్టి దెబ్బ తగిలిందని చెప్పక తప్పదు.

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ సినిమా కలెక్షన్స్‌...

తెలుగు రాష్ట్రాల్లో విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ సినిమా సెకండ్‌ వీక్‌లోనూ స్ట్రాంగ్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్‌ వర్గాల వారు భావించారు. సినిమాకు వచ్చిన పాజిటివ్‌ టాక్‌, పాజిటివ్‌ రివ్యూల కారణంగా రెండో వారంలో భారీ వసూళ్లు నమోదు చేయడం ద్వారా సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ కలెక్షన్స్‌ మూవీగా ఈ సినిమా నిలుస్తుందని, అలాగే వెంకీ మూవీస్‌లోనూ పెద్ద హిట్‌ మూవీగా నిలుస్తుందని అంతా భావించారు. కానీ మొత్తం మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ పై ఇరుముడి సినిమా ఆధిపత్యం కనిపిస్తోంది. రెండు పెద్ద సినిమాలు, హిట్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఉన్న సమయంలో కొత్తగా వచ్చిన సినిమా వైపు ప్రేక్షకులు వెళ్లడం పరిపాటిగా వస్తుంది. కనుక ఈ వారం ఇరుముడి సినిమాను ఎక్కువ మంది చూస్తారు. విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ చూడాలి అనుకున్న వారు సైతం ఇరుముడి సినిమా వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రవితేజ ఇరుముడి సినిమాతో...

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ కి మొదటి వారం బాక్సాఫీస్‌ వద్ద తిరుగు లేకుండా వసూళ్లు నమోదు అయ్యాయి. వారం రోజుల్లో దాదాపుగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయినట్లుగా బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు ఏరియాలు మినహా మొత్తం బ్రేక్ ఈవెన్‌ నమోదు అయిందని, ఆ మిగిలిన ఏరియాల్లోనూ రెండో వారం బ్రేక్ ఈవెన్‌ సాధ్యం అవుతుందని యూనిట్‌ సభ్యులు భావించారు. కానీ సూర్య సినిమాకు రవితేజ సినిమా గట్టి దెబ్బ వేసింది. ఇరుముడి సినిమాతో విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లను సైతం రాబట్టే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇరుముడి సినిమాకు వస్తున్న పాజిటివ్‌ బజ్‌ కారణంగా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ గురించి జనాలు మాట్లాడుకోవడం తగ్గుతుంది. దాంతో బాక్సాఫీస్‌ సందడి సైతం తగ్గడం ఖాయం.

యశ్‌ టాక్సిక్ సినిమాతో బాక్సాఫీస్‌...

రవితేజతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా ఇరుముడి సినిమాకి సాధ్యం అయినంత ఎక్కువ పబ్లిసిటీ చేయడం జరిగింది. దానికి తోడు సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ సందడి మొదలైంది. వసూళ్ల విషయంలోనూ షాకింగ్‌ నెంబర్స్ నమోదు కావడం ఖాయంగా బాక్సాఫీస్‌ వర్గాల వారు చెబుతున్నారు. బుక్‌ మై షో తో పాటు ఇతర ఆన్‌ లైన్‌ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ల్లో ఇరుముడి చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. పైగా సోషల్‌ మీడియాలో ఇరుముడి కి సంబంధించిన విశేషాలు, వీడియోలు మారుమోగుతున్నాయి. అందుకే ప్రేక్షకులు ఈ వీకెండ్‌ను ఇరుముడికి అంకితం చేసే అవకాశాలు ఉన్నాయి. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ అందుకున్న ఇరుముడి సినిమా లాంగ్‌ రన్‌లో ఏ స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తుంది అనేది చూడాలి. అయితే వచ్చే ఏడాది ఇరుముడికి టాక్సిక్ సినిమాతో గట్టి పోటీ ఉండబోతుంది. మరి ఆ పోటీని ఇరుముడి ఏ స్థాయిలో తట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News